ఈ మద్య ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. సంపాదించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంతో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా.. కుటుంబ పోషణ కోసం జీవన పోరాటం తప్పదు. అనుకోని పరిస్థితిలో ప్రమాదానికి గురై కన్నుమూసినా.. ప్రమాద బీమా కుటుంబాన్ని ఆదుకుంటాయి.. ఇటీవల వీటిపై ప్రజలకు అవగాహన పెరిగింది. దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం ఎంతగా చూపిందో అందరికీ తెలిసిందే. కరోనా తర్వాత మనిషి జీవితమే కాదు.. ఆర్థిక భద్రతపై కూడా అవగాహన పెరిగింది. ఈ నేపథ్యంలోనే జీవిత బీమా, ఆరోగ్య బీమా తీసుకునేవారి సంఖ్య పెరిగిపోతుంది.
ఇప్పటికే దేశంలో ఎన్నో పలు రకాల బీమా కంపెనీలు ఎన్నో ఆఫర్లతో ప్రజల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలో తపాలా శాఖ ఓ బీమా పథకం తీసుకు వస్తుంది. ఈ బీమా పథకం టాటా ఏఐజీలతో కలిసి గ్రూప్ యాక్సిడెంట్ గార్డ్ పేరిట తీసుకు వచ్చింది. ఈ భీమా కోసం ఏడాదికి రూ.399 కడితే రూ.10 లక్షల రూపాయలు ప్రమాద బీమా సౌకర్యం కల్పించబోతుంది. ఈ ప్రమాద బీమా పథకం పెద, మద్యతరగతి వారికి ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు.
ఎవరు అర్హులు :
తపాలా శాఖ వారు తీసుకు వచ్చిన ఈ బీమా పథకంలో 18 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న వారు అర్హులు. ఈ బీమా పొందాలంటే పోస్టల్ పేమెంట్ బ్యాంక్ లో తప్పని సరిగా ఖాతా ఉండాలి. ఈ బీమా చేసుకున్న వారు ఏదైనా ప్రమాదానికి గురైతే ఆసుపత్రి ఖర్చుల కోసం 60 వేల రూపాయలు గానీ.. క్లెయిమ్ చేసిన మొత్తంలో తక్కువ ఏదైతే ఉంటుందో దాన్ని చెల్లిస్తారు. చికిత్స చేసుకున్న తర్వాత ఆస్పత్రి నుంచి వెళ్లేవారికి రూ.30 వేలు కానీ.. క్లెయిమ్ చేసుకున్న మొత్తంలో ఏదైదే తక్కువ ఉంటుందో దాన్ని చెల్లిస్తారు. ఒకవేల బీమా చేసుకున్న వ్యక్తి ప్రమాదంలో మరణించినా.. ఏదైనా అవయవం కోల్పోయినా.. పక్షవాతం వచ్చినా పదిలక్షల రూపాయలు చెల్లిస్తారు. ఈ బీమాను పోస్టల్ మేపెంట్ బ్యాంక్ ద్వారా మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.
ఇతర ప్రయోజనాలు :
ఈ బీమాతో మరికొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే.. వారి ఎడ్యూకేషన్ అవసరాల నిమిత్తం ఫీజు లో పది శాతం లేదా లక్ష రూపాయాల వరకు ఎంచుకునే అవకాశం ఉంటుంది. బీమాదారుడు మరణిస్తే.. అంత్యక్రియలకు 5 వేల రూపాయాలు.. కుటుంబ అవసరాల నిమిత్త 25 వేలు అందుతాయి. అంతేకాదు ప్రమాదానికి గురై హాస్పిటల్ లో చేరిన వారికి రోజు వారీ చొప్పన 1000 రూపాయాలు నగదు రూపంలో 10 రోజుల వరకు అందిస్తారు.
రూ.299 కి మరో అవకాశం :
ఈ పథకంలో మరో అవకాశం కూడా తపాలా శాఖ వారు అందిస్తున్నారు. ఏడాదికి 299 రూపాయలు చెల్లిస్తే.. 10 లక్షల బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. చనిపోయిన వారికి.. ప్రమాదంలో శాశ్వతంగా అంగవైకల్యానికి గురైన వారికి ఈ బీమా పథకం వర్తిస్తుంది. కాకపోతే రూ.399 ఉండే కొన్ని ప్రయోజనాలు ఈ బీమా లో వర్తించవు. ఏది ఏమైనా ప్రస్తుతం మనిషికి ఎప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియని పరిస్థితి.. అందుకే ఇలాంటి ప్రమాద బీమా పథకాలు తీసుకోవడం ఎంతో మంచిదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.