చిన్నా చితకా ఉద్యోగాలు చేయాలని లేదు.. మరీ ముఖ్యంగా ఉన్న వారు వదిలి వెళ్లాలంటే మనసు రావడం లేదు. కానీ ఏం పని చేయకుండా ఇంటి దగ్గర ఖాళీగా కూర్చుంటే సంపాదన ఎలా.. మరి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా. మీలాంటి వారికోసం మంచి అవకాశం కల్పిస్తోంది పోస్టాఫీస్. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ లాభాలు పొందాలి.. అది కూడా సొంతూరిలోనే అంటే బెస్ట్ ఆప్షన్ పోస్టాఫీస్ ఫ్రాంచైజీ. ప్రస్తుతం మెయిల్స్, కొరియర్ సర్వీసులు ఎన్ని అందుబాటులోకి వచ్చినా.. పోస్టాఫీస్ మీద పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. పైగా మారుతున్న కాలానికి తగ్గట్టు.. పోస్టాఫీసుల్లో కూడా పలు రకాల సేవలు అందిస్తున్నారు. మెయిల్ డెలివరీ, డిపాజిట్ స్కీమ్లు, పోస్టల్ లైఫ్ ఇన్సురెన్స్ వంటి సేవలు అందిస్తోంది. ఇక పోస్టాఫీసు అందించే ముఖ్యమైన కార్యకలపాలు దేశవ్యాప్తంగా ప్రజలకు అందుబాటులోకి తేవడం కోసం పోస్టాఫీస్ ఫ్రాంఛైజీలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఈ పోస్టాఫీస్ ఫ్రాంఛైజీ తీసుకుంటే.. సొంత ఊరిలోనే.. తక్కువ పెట్టుబడితో.. ఎక్కువ రాబడి పొందవచ్చు. మరి ఈ పోస్టాఫీసు ఫ్రాంఛైజీలో ఎలాంటి సేవలు అందిస్తారు.. దీని కోసం ఎలా దరఖాస్తు చేయాలి.. ఏమేం డాక్యుమెంట్స్ కావాలనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
మరి ఇంకేందుకు ఆలస్యం.. పోస్టాఫీసు ఫ్రాంఛైజీకి అప్లై చేసి.. ఉన్న ఊరిలోనే డబ్బులు సంపాదించుకోండి. పెట్టుబడి కూడా తక్కువే. ఒక్కసారి బిజినెస్ సెట్ చేస్తే.. దీర్ఘకాలం కొనసాగుతుంది. కాబట్టి.. తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేయాలనుకునే వారు.. పోస్టాఫీస్ ఫ్రాంఛైజీ కోసం ప్రయత్నించండి.