ఏపీలో విశాఖపట్నం తర్వాత రియల్ ఎస్టేట్ బాగున్నా ఏరియా కృష్ణా జిల్లా. ఈ జిల్లాలో ఎక్కడ స్థలాల మీద పెట్టుబడి పెడితే లాభాలు ఉంటాయో అనేది ఇప్పుడు చూద్దాం.
పూణె-మచిలీపట్నం ఎన్ హెచ్-65, కత్తిపూడి-ఒంగోలు ఎన్ హెచ్-216.. రెండు జాతీయ రహదారుల పనులు పూర్తవ్వడం.. అలానే మచిలీపట్నం ఓడరేవు నిర్మాణ పనులు ప్రారంభం కావడం వల్ల రియాల్టర్లు, పెట్టుబడిదారులు రియల్ ఎస్టేట్ సెక్టార్ లో పెట్టుబడులు పెట్టేందుకు కృష్ణా జిల్లా వైపు మొగ్గు చూపుతున్నారు. విస్తారమైన పొలాలు, పుష్కలమైన నీటి వనరులు, రవాణా సదుపాయాలు మంచిగా ఉండడం వంటి కారణాల వల్ల కృష్ణా జిల్లా రియాల్టర్లను ఆకర్షిస్తోంది. ఇక్కడ వెంచర్లు వేసేలా వారిని ఆకర్షిస్తోంది. బిల్డర్లు, రియాల్టర్లు తాడిగడప, పెనమలూరు, పోరంకి, కంకిపాడు, ఉయ్యూరు, గూడూరు, మచిలీపట్నం నుండి ఎన్ హెచ్ 65 పక్కన 70 కి.మీ. వరకూ వెంచర్లను ఏర్పాటు చేస్తున్నారు.
మచిలీపట్నం-విస్సన్నపేట స్టేట్ హైవే పక్కన మచిలీపట్నం, గుడివాడ మధ్యలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను చేపట్టారు. వలంద పాలెం, హుస్సేన్ పాలెం, పెడన, వడ్లమన్నాడు, గుడ్లవల్లేరు, అంగలూరు, బొమ్మలూరు, గుడివాడ ఏరియాల్లో ఈ ప్రాజెక్టులను చేపడుతున్నారు. రియాల్టర్లు, బిల్డర్లు కోవిడ్ ప్రభావంతో మూడేళ్లు అసంతృప్తిగా ఉన్నారు. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపుతున్నారు. అందుకు కృష్ణా జిల్లా అనుకూలమైన ప్రాంతంగా భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ఉజ్వల భవిష్యత్తు, అధిక లాభాలు వస్తాయన్న నమ్మకంతో కృష్ణా జిల్లా పరిధిలోని పొలాలను భారీగా కొనుగోలు చేసి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వాటిని రియల్ ఎస్టేట్ వెంచర్లుగా ఏర్పాటు చేస్తున్నారు.
ఇక్కడ భూముల కొనుగోళ్లతో రైతులకు భారీగా లాభాలు వచ్చాయి. భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. మచిలీపట్నం ప్రాంతంలో హైవే దగ్గరలో ఎకరం రూ. 3 కోట్లు నుంచి రూ. 5 కోట్లకు అమ్ముతున్నారు. గతంలో ఎకరం రూ. 40 లక్షల నుంచి రూ. 2 కోట్లు ఉండేది. అలానే హైవేకి దూరంగా ఉన్న గ్రామాల్లో ఎకరం రూ. 30 లక్షల నుంచి రూ. 40 లక్షలకు పెరిగింది. అంతకు ముందు రూ. 15 లక్షల నుంచి రూ. 25 లక్షలు ఉండేది. ఎన్ హెచ్-216 పక్కన మచిలీపట్నం రోడ్డు కృత్తివెన్ను నుంచి అవనిగడ్డ ప్రాంతాల్లో ఎకరం రూ. 2 కోట్లకు పెరిగింది. మచిలీపట్నం నుంచి గుడివాడ స్టేట్ హైవే పక్కన ఎకరం రూ. 2 కోట్లు నుంచి రూ. 4 కోట్లకు పెరిగింది ఎకరం. మచిలీపట్నం నుంచి తాడిగడప అయితే ఎకరం రూ. 3 కోట్ల నుంచి రూ. 7 కోట్లకు పెరిగింది. అంతకంటే ఎక్కువ ధర కూడా పలుకుతోంది. అధిక ధరలు ఉన్నప్పటికీ రియాల్టర్లు భూములను కొనుగోలు చేసి వెంచర్స్ ని స్టార్ట్ చేస్తున్నారు.
మచిలీపట్నం సమీపంలో చదరపు అడుగు రూ. 10 వేల చొప్పున ప్లాట్స్ ని విక్రయిస్తున్నారు. కంకిపాడు, పెనమలూరు ప్రాంతాల్లో అయితే ఈ ధర రెట్టింపు అయ్యింది. ఎన్ హెచ్-16 (చెన్నై-కోల్కతా హైవే) పక్కన విజయవాడ సమీపంలో రామవరప్పాడు నుంచి హనుమాన్ జంక్షన్ తో పాటు కృష్ణాజిల్లా పరిధిలోకి వచ్చే రియల్ ఎస్టేట్ మరియు భూముల ధరలు ఊహించని విధంగా ఉంటాయి. రామవరప్పాడు, పోరంకి, పెనమలూరు, మచిలీపట్నం ఏరియాల్లో ఏజెంట్లు, ఓనర్లు అమ్ముతున్న స్థలాల రేట్లు చదరపు అడుగు రూ. 600, రూ. 1200, రూ. 3 వేలు, రూ. 4 వేలు, రూ. 5 వేలు రేంజ్ లో ఉన్నాయి. గజం రూ. 5,400 నుంచి రూ. 45 వేల రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు కొనుగోలు చేసిన వారికి భవిష్యత్తులో మంచి లాభాలు వస్తాయి.