బంగారు అభరణాలు కొనుగోలు చేస్తే ఇంత నష్టమా? వినటానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజమని అంటున్నారు మార్కెట్ రంగ నిపుణులు. అసలు వాళ్లు ఏం చెబుతున్నారంటే?
ఈ రోజుల్లో డబ్బులు ఉన్న చాలా మంది ముందుగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. కొందరు ధరించడానికి కొనుగోలు చేస్తుంటే..మరి కొందరు పెట్టుబడిలో భాగంగా బంగారాన్ని కొంటుంటారు. కానీ, బంగారం కొనుగోలు చేయడం ద్వారా మనం చాలా నష్టపోతున్నామని చాలా మందికి తెలియదు. బంగారం కొనుగోలు చేయడం ద్వారా నష్టపోవడమే ఏంటని ఆలోచిస్తున్నారా? అవును.. మీరు విన్నది. అసలు బంగారు అభరణాలు కొనుగోలు చేయడం ద్వారా ఎలా నష్ట పోతాం? నిపుణులు ఏం చెబుతున్నారంటే?
భారతదేశంలో బంగారానికి ఎంతో విలువ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ ఎక్కువనే చెప్పాలి. దీంతో చాలా మంది పైసా పైసా కూడబెట్టి బంగారు అభరణాలు కొనుగోలు చేస్తారు. అయితే కొనుగోలు చేసిన బంగారు అభరణాలను ఫంక్షన్స్ లో వేసుకోవడమే కాకుండా ఆపద సమయాల్లో కుదవ బెట్టి ఆ తర్వాత మళ్లీ తెచ్చుకుంటుంటారు. అసలు బంగారు కొనుగోలు చేయడం ద్వారా మనం ఎలా నష్టపోతున్నామంటే?.. సాధారణంగా మనం ఎక్కడైన బంగారం కొనుగోలు చేసే సమయంలో తరుగు, మేకింగ్ చార్జీలు చెల్లించి కొంటాం.
ఇక మనం కొనుగోలు చేసిన బంగారాన్ని అమ్మే సమయంలో వేస్టేజ్ కింద తీసేసి కొంటారు. అంటే మనం అమ్మే సమయంలో కేవలం 70 శాతానికి మాత్రమే డబ్బును చెల్లిస్తారు. దీంతో మనం 30 శాతం బంగారం కోల్పోయే ఆస్కారం ఉంటుంది. ఇలా కొనుగోలు చేసే సమయంలో నష్టపోతాం, అమ్మే సమయంలో కూడా నష్టపోతున్నామని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే బంగారాన్ని పెట్టుబడి పెట్టే సమయంలో సావరిన్ గోల్డ్ బాండ్ లను కొనుగోలు చేయడం చాలా వరకు మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీని ద్వారా ఎలాంటి రిస్క్ ఉండని కూడా చెబుతున్నారు.