గజం స్థలం రూ. 20 వేలు! ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే పదింతల లాభం!

తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాలను పొందాలని మీరు భావిస్తున్నారా? ఫ్యూచర్ హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో లక్షలు పెట్టుబడి పెడితే కోట్లలో లాభాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

  • Written By:
  • Updated On - June 7, 2023 / 10:57 AM IST

హైటెక్ సిటీలో ఇప్పుడు స్థలం కొనాలంటే గజం రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల రేంజ్ లో ఉంటుంది. ఈ ఏరియాలో కొనుగోలు చేసినా పెద్దగా ఏమీ పెరగదు. మహా అయితే రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షలు పెరగొచ్చు. పెట్టుబడి కోణంలో చూస్తే ఇదేమీ పెద్ద లాభం ఏమీ కాదు. రెట్టింపు లాభాలు వచ్చే కంటే పదింతల లాభం వస్తేనే అది సరైన ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. బాగా అభివృద్ధి చెందిన ఏరియాలో ఇన్వెస్ట్ చేయడం అంటే డబ్బు వేస్ట్ చేయడమే. అదే అభివృద్ధి చెందే ఏరియాలో, బాగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న ఏరియాల్లో పెట్టుబడి పెడితే లక్షల్లో లాభం పొందే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు శ్రీశైలం హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవేలు తీసుకుంటే.. ఈ ఏరియాలు ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. ఈ ఏరియాల్లో స్థలం రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి.

భవిష్యత్తులో ఈ ఏరియాలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాయి. మరో హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ లుగా అభివృద్ధి చెందుతాయి. ఇందులో ఎలాంటి అనుమానం పడక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. బెంగళూరు హైవే చూసుకుంటే కనెక్టివిటీ పరంగా చాలా అద్భుతంగా ఉంది. రోడ్, రైల్వే కనెక్టివిటీ అనేది బాగుంది. షాద్ నగర్, కొత్తూరు, జడ్చర్ల, పింజర్ల వంటి ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే భవిష్యత్తులో మంచి లాభాలు పొందవచ్చునని చెబుతున్నారు. ఎంఎంటీఎస్ సర్వీసు మొదలైతే షాద్ నగర్ నుంచి గచ్చిబౌలి రావడానికి 45 నిమిషాలు కంటే తక్కువ సమయమే పట్టచ్చు. కనెక్టివిటీ బాగుంది కాబట్టి పెట్టుబడికి బెంగళూరు హైవే బెస్ట్ అవుతుందని చెబుతున్నారు. షాద్ నగర్ లో గజం రూ. 6 వేల నుంచి రూ. 12 వేలు రేంజ్ లో ఉంది.

ఇక ముంబై హైవే కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియా అని చెప్పవచ్చు. జహీరాబాద్, సంగారెడ్డి, ముత్తంగి, కంకోల్, సదాశివపేట ఏరియాల్లో పెట్టుబడి పెడితే మంచి లాభాలను పొందవచ్చు. మౌలిక సదుపాయాలు, ఉద్యోగ కల్పన వంటివి కలిగిన ఏరియా ముంబై హైవే. కాబట్టి భవిష్యత్తులో ఈ ప్రాంతంలో డిమాండ్ అనేది బాగా పెరిగిపోతుంది. శ్రీశైలం హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే ఏరియాల్లో ఉన్న గ్రామాల్లో గజం రూ. 2 వేల నుంచి రూ. 20 వేల రేంజ్ లో ఉన్నాయి. హైవేకి దగ్గరగా గజం రూ. 20 వేలు చొప్పున 150 గజాలు కొనుగోలు చేసినా గానీ మీ పెట్టుబడి రూ. 30 లక్షలు అవుతుంది. సిటీలో లక్ష, 2 లక్షలు పెట్టి గజం స్థలం కొనుగోలు చేస్తే మహా అయితే 2 నుంచి 4 లక్షలు అవుతుంది. రెండు రెట్లు పెరుగుతుంది ల్యాండ్ విలువ.

అదే గజం రూ. 20 వేల చొప్పున హైవే ఏరియాలో కొనుగోలు చేస్తే అది డెవలప్ అయ్యే నాటికి గజం రూ. లక్ష, రూ. 2 లక్షలు, రూ. 3 లక్షలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. హైటెక్ సిటీలో ఇప్పుడున్న ధరలు ఈ ఏరియాల్లో చూడవచ్చునని చెబుతున్నారు. ఇప్పుడు లక్షల్లో పెట్టుబడి పెడితే కోట్లలో లాభాలు పొందవచ్చునని అంటున్నారు. రూ. 30 లక్షలు లేకపోయినా రూ. 20 లక్షలు, రూ. 10 లక్షల బడ్జెట్ లో కూడా ల్యాండ్ మీద పెట్టుబడి పెట్టవచ్చు. శ్రీశైలం హైవే మీద ఉన్న తుక్కుగూడలో చదరపు అడుగు సగటున రూ. 1950 పలుకుతోంది. అంటే గజం రూ. 17,550. 150 గజాలు కొనుగోలు చేస్తే రూ. 26 లక్షలు అవుతుంది.

ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలంటే గజం రూ. 7,500 నుంచి రూ. 10 వేల లోపు ఉన్నాయి. జహీరాబాద్ నిమ్జ్ ఏరియాకి వెళ్ళిపోతే అక్కడ ఈ రేట్లు దొరుకుతాయి. అప్పుడు 150 గజాలకు రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షలు అవుతుంది. అభివృద్ధి చెందిన తర్వాత ఈ ఏరియాల్లో భూమి కొనాలన్నా కొనలేని పరిస్థితి వస్తుంది. డిమాండ్ అనేది పెరిగిపోతుంది. కంపెనీలు, ఉద్యోగ అవకాశాలు పెరిగిపోవడంతో ఈ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అనేది భారీగా పెరిగిపోతుంది. కాబట్టి పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఈ ఏరియాలే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏరియాలని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశీలించి, నిపుణులను సంప్రదించవలసినదిగా మనవి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV

Most viewed