మధ్య తరగతి మానవుడికి లైఫ్ లో ఒక్కసారైన విమానం ఎక్కాలని కోరికగా ఉంటుంది. కానీ విమాన టికెట్ ఖరీదని తమ కలలను అలాగే అణచిపెట్టుని బతుకుతూ ఉంటారు. అలాంటి మధ్యతరగతి వారి కలను మేం నెరవేరుస్తాం అంటూ ముందుకు వచ్చింది ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో. గతంలో కూడా ఎన్నో ఆఫర్లతో ప్రయాణికులను ఆకట్టుకున్న సంస్థ.. తాజాగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై తగ్గింపు ధరలకే టికెట్లు అందిస్తామని బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం రూ. 2 వేలకే దేశీయ ప్రయాణం లభిస్తుందని పేర్కొంది. టికెట్లు అందుబాటులో ఉన్నంత వరకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ స్పెషల్ ఆఫర్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఇండిగో వింటర్ సీజన్ కు సంబంధించి అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. మధ్యతరగతి మానవుడికి అందుబాటు ధరలో విమాన ప్రయాణాన్ని కల్పించనుంది. నేటి నుంచి అంటే డిసెంబర్ 23 టూ 25 వరకు మూడు రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలిపింది. దేశీయ ప్రయాణానికి రూ.2,023గా.. అంతర్జాతీయ ప్రయాణాలకు రూ. 4999కే టికెట్ ధరలను నిర్ణయించింది. అయితే 2023 జనవరి 15 నుంచి ఏప్రిల్ 14 మధ్య ప్రయాణానికి ఈ టికెట్లు లభిస్తాయని ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. మూడు రోజులే ఉన్న ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలని సూచించింది. ఈ క్రమంలోనే ఈ స్పెషల్ డిస్కౌంట్.. ప్రస్తుతం ఉన్న ఏ ఆఫర్ తోగానీ, ప్రమోషన్ తోగానీ, స్కీమ్ తో గానీ కలిపి వర్తించదని సంస్థ స్పష్టం చేసింది.
Holiday sale! Get out of town with fares starting at ₹2023. Book till 25th December, 2022 for travel between 15th January, 2023 & 14th April, 2023. Book now. T&C apply. https://t.co/OPEazbbwyM pic.twitter.com/2WEUeVKfAT
— IndiGo (@IndiGo6E) December 23, 2022
దాంతో పాటుగా ఇండిగో గ్రూప్ బుకింగ్స్ కూడా వర్తించదని పేర్కొంది. అయితే HSBC కస్టమర్లు మాత్రం అదనంగా క్యాష్ బ్యాక్ పొందొచ్చు అని పేర్కొంది. కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్న వేళ చాలా మంది హాలీడేస్ కు వెళ్తారని.. అలాంటి వారి కోసమే ఈ సేల్ ను తీసుకొచ్చినట్లు ఇండిగో గ్లోబల్ సేల్స్ హెడ్ వినయ్ మల్హోత్రా తెలిపారు. గత కొంత కాలంగా విమానయాణ రంగం పుంజుకుందని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ప్రస్తుతం ఇండిగోకు టోటల్ గా 290 విమానాలతో రోజుకు 1600 విమాన సర్వీసులను నడుపుతోంది. వాటిల్లో 76 దేశీయ, 26 అంతర్జాతీయ గమ్యస్థానాలు ఉన్నాయి. ఈ ఆఫర్ ను వినియోగించుకోవాలని ఇండిగో సంస్థ కోరింది.