ప్రముఖ ఫోటో మెసేజింగ్, ఫోటో షేరింగ్ యాప్ స్నాప్‌చాట్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియా దిగ్గజాలుగా ఉన్న ఫేస్‌బుక్, ట్విట్టర్ బాటలోనే పయణిస్తూ.. అనతి కాలంలోనే ఇండియాలో యూజర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోగలిగింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తనదైన ముద్ర వేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలో స్నాప్‌చాట్ సీఈఓ ఇవాన్ స్పీగెల్.. గతంలో ఇండియాపై చేసిన ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. 2015లో స్నాప్‌చాట్ సిఇవో ఇవాన్ స్పీగెల్ దేశంపై అవమానకర వ్యాఖ్యలు చేశాడు. తమ వ్యాపారాన్ని విస్తరించేంత సీన్ భారత్‌కు లేదని.. భారతదేశం లాంటి పేద దేశంలో స్నాప్‌చాట్ వ్యా పార విస్తరణ అవసరం లేదని వ్యాఖ్యానించాడు. తమ యాప్ కేవలం ధని కులకోసమే తప్ప.. పేదోళ్లకి కాదంటూ నిర్లక్ష్యంగా వ్యాఖ్యానించాడు. అంతే కాదు ఇండియా, స్పెయిన్ లాంటి పేద దేశాల్లో విస్తరించాలని తాను కోరుకోవడంలేదని అప్పట్లో పేర్కొన్నాడు. స్పీగెల్ చేసిన ఈ వ్యాఖ్యలు అప్పట్లో పెను దుమారాన్ని రేపాయి.
ఇది కూడా చదవండి: ట్విట్టర్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో ఎలన్ మస్క్ కు చోటు.. ప్రకటించిన ట్విట్టర్భారత్, స్పెయిన్ వంటి దేశాల్లో స్నాప్‌చాట్‌కు వృద్ధి అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయ ని చెప్పానని, అప్పుడు స్పీగెల్ జోక్యం చేసుకుని “స్నాప్‌చాట్ కేవలం సంప న్నులకు మాత్రమే”నని చెప్పి, తన మాటలను అడ్డుకున్నారని ఆంథోనీ ఆరోపించినట్లు వార్తలొచ్చాయి. అయితే.. పాంప్లియానో మాటలన్నీ కట్టు కథలనీ.. వ్యాపార భాగస్వాములను మోసం చేయడానికే ఇలా మాట్లాడారని.. ఇవన్నీ ఆరోపణలు మాత్రమేనని పేర్కొంది. ఇండియా, స్పెయిన్ లాంటి దేశాల్లో పొటెన్షియల్ గ్రోత్‌పై దృష్టి పెట్టాలని.. స్పీగెల్ సూచించాడని కంపెనీ వివరణ ఇచ్చింది.
2017: Snapchat’s ex employee Pompliano alleged that CEO Spiegel not interested in expanding business to poor countries like India, Spain.
Though, Snapchat dismissed claims by its employee.
January 2022: India had biggest Snapchat user base in the world & USA ranked in 2nd place
— Anshul Saxena (@AskAnshul) April 7, 2022
అయితే.. జనవరి 2022 డేటా ప్రకారం.. స్నాప్‌చాట్ యూజర్లలో.. పేద దేశమంటూ అవమానించిన ఇండియా మొదటి స్థానంలో ఉండగా.. అమెరికా రెండో స్థానికి పరితమైంది.
Snapchat user-base by countries:
India – 126 million
USA – 107 million
France – 24.2 million
United Kingdom – 20.65 million
Saudi Arabia – 20.2 million— Index of India 🇮🇳 (@indexofindia) April 7, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.