బంగారం.. ఈ పేరుతో పిలిచినా, ఆ పేరు విన్నా నారీమణులు ఫుల్ ఖుషీ అయిపోతారు. ఎందుకంటే అది అంత విలువైంది కాబట్టి. పుట్టిన రోజు, పెళ్లి రోజు..ఏదైనా శుభకార్యాల నిమిత్తం దుస్తులతో పాటు బంగారం కొనేందుకు ఆడవాళ్లు ఆసక్తి చూపుతారు. పసిడి ధర పెరిగిందా వారి మెహలు కూడా వెలవెలబోతాయి. కాస్త తగ్గిందా బంగారం దుకాణాలకు క్యూ కడతారు. అయితే కొన్ని రోజుల నుండి పసిడి ధరల పెరుగుతున్నాయి. పోనీ వెండి వస్తువులు తీసుకుందామా అంటే దానిదీ అదే పరిస్థితి.
గత రెండు నెలలుగా పసిడి ధరలకు రెక్కలు వస్తున్నాయి. గత రెండు రోజుల నుండి కాస్త తగ్గుముఖం పట్టాయనిపించినప్పటికీ గురువారం మళ్లీ బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.100 పెరిగింది. ఈ పండుగ సీజన్ లో నైనా ధర తగ్గకపోతుందా అని ఎదురు చూస్తున్న మహిళలకు నిరాశే ఎదురైంది. 24 క్యారెట్ల పసిడి రూ. 56 వేల పైకి చేరుకోగా.. 22 క్యారెట్ ధర కూడా రూ. 51,500 వైపుగా పరుగులు తీస్తోంది. వెండి ధర మాత్రం నిలకడగా కొనసాగుతోంది.
హైదరాబాద్ లో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,120 పలుకుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 51,400కి పెరిగింది. అటు విజయవాడలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 56,070 ఉండగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 51,400గా ఉంది. ప్రస్తుతం కేజీ వెండి ధర 71,500 వద్దకు చేరింది. ఇటీవల యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను పెంచినప్పటికీ బంగారం, వెండి వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టలేదు.