కారు అనేది కొన్నాళ్ల క్రితం వరకు విలాస వస్తువుగా ఉండేది. కానీ, మారుతున్న పరిస్థితుల్లో కారు అనేది అవసరంగా మారిపోయింది. చాలా మధ్యతరగతి కుటుంబాలకు కారు అవసరం ఉన్నా కొనే స్తోమత లేక కొందరు, సరైన ఆఫర్లు, ధరలు లేక మరికొందరు కారు జోలికి పోకుండా ఉండిపోతున్నారు. అయితే ఇప్పుడు అలాంటి వారి కోసమే అదిరిపోయే ఆఫర్ ఒకటి వచ్చింది. ఈ ఆఫర్ ఏంటంటే.. మీరు కారుని ఇప్పుడు తీసుకెళ్లండి.. కానీ, డబ్బు మాత్రం తర్వాత చెల్లించండి అంటూ ఓ కంపెనీ అద్భుతమైన ఆఫర్ ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ ని దసరా, దీపావళి సేల్ కింద చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు మాత్రమే అందిస్తోంది. ఆ కారు కంపెనీ మరేదో కాదు.. భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న జపనీస్ కార్ కంపెనీ హోండా.
హోండా కార్ కంపెనీ వినియోగదారుల కోసం ప్రస్తుతం ‘డ్రైవ్ ఇన్ 2022, పే ఇన్ 2023’ అనే ఆఫర్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే మీరు ఒక్క రూపాయి కూడా కట్టకుండా కారుని ఈ ఏడాదిలో కొనుగోలు చేయండి. ఆ కారుకు సంబంధిని సొమ్మును మీరు వచ్చే ఏడాది అంటే 2023లో చెల్లించండి. ఈ ఆఫర్ పండగ సీజన్లో తమ కార్లకు మంచి డిమాండ్ పెరిగేలా చేస్తాయని జపనీస్ కంపెనీ హోండా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ ఆఫర్లో హోండా కంపెనీ కోటక్ మహీంద్రా ప్రైమ్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. హోండా కారును కొనాలనుకున్న వాళ్లు.. మీ దగ్గర్లోని హోండా కారు షోరూమ్ వెళ్లండి. అక్కడ మీకు నచ్చిన కారును సెలక్ట్ చేసుకున్న తర్వాత డ్రైవ్ ఇన్ 2022- పే ఇన్ 2023 అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి. తద్వారా మీకు నెలవారీ వాయిదాలు 2023 నుంచే ప్రారంభం అవుతాయి. అంటే ఈ నాలుగు నెలలు మీరు ఎలాంటి వాయిదాలు కట్టాల్సిన అవసరం లేదు.
అయితే ఈ ఆఫర్ కావాలనుకుంటే మీరు త్వరపడాలి. ఎందుకంటే హోండా కంపెనీ దీనిని లిమిటెడ్ పిరియడ్ ఆఫర్‌గా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటుందని చెలిపింది. ఈ ఆఫర్లో భాగంగా కారు ఆన్ రోడ్ ధరలో 85 శాతం వరకు ఫైనాన్స్ లభిస్తుందని తెలిపింది. ఈఎంఐ మాత్రం వచ్చే జనవరి నుంచే చెల్లించ వచ్చని తెలిపింది. ఇలాంటి ఆఫర్ ద్వారా వినియోగదారులు ప్రస్తుతం తమ వద్ద డబ్బు లేకున్నా కారును కొనుగోలు చేయచ్చని ఆ కంపెనీ ప్రతినిధులు తెలియజేస్తున్నారు. వచ్చే ఏడాది నుంచి నెలవారీ పద్ధతిలో చెల్లించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంక హోండా కంపెనీ కార్ల విషయానికి వస్తే హోండా సిటీ, హోండా అమేజ్ కార్లు ఇప్పటికే వినియోగదారుల ఆదరణను పొందాయి. ఇలాంటి ఆఫర్లు ద్వారా ఆ కంపెనీ సేల్స్ కూడా పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది.