రిలయన్స్ జియో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే టెలికాలం రంగంలో జియో సృష్టించిన సంచలనం తెలిసిందే. ఇలాంటి సంచలనాలకి కేరాప్ అడ్రెస్ అయిన రిలయన్స్ జియో తాజాగా మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్దమ్యయింది. తక్కువ ధర ల్యాప్ టాప్ లను అందించనుంది. అతి తక్కువ ధరకే ల్యాప్ టాప్ ను అందించనున్నట్లు రిలయన్స్ జియో అధినేత ముఖేశ్ అంబానీ గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మాటలను నిజం చేస్తూ ఇప్పుడు దాన్ని ‘జియోబుక్’ అనే పేరు ల్యాప్ టాప్ ను ఇండియన్ మార్కెట్ లో రిలీజ్ చేసేందుకు జియో రెడీ అయ్యింది.
రిలయన్స్ జియో విడుదల చేయనున్న ఈ ల్యాప్ టాప్ ధర కేవలం రూ.15 వేల ఉంటనుంది. ఇందులో 4జీ సిమ్ కార్డును ఇన్ బిల్డ్ గా ఇవ్వనున్నారు. దీంతో ఎక్కడైనా నేరుగా ఇంటర్నెట్ వాడుకునేందుకు వీలుగా ఉంటుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించేందుకు జియో వర్గాలు నిరాకరించాయి. టెక్ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం.. ఇప్పటికే గ్లోబల్ దిగ్గజ కంపెనీలైన క్వాల్‌కామ్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలతో రిలయన్స్ జియో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ‘జియోబుక్’ కోసం ఈ కంపెనీల మధ్య ఒప్పదం కుదిరినట్లు తెలుస్తోంది. క్వాల్ కామ్ సంస్థ కంప్యూటింగ్ చిప్ ను అందిస్తుంది. విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో అవసరానికి అనుగుణంగా ప్రత్యేకంగా మార్పులు చేసిన ‘జియో ఆపరేటింగ్ సిస్టం’ ఉంటుంది.
దీని తోపాటు జియోకు సంబంధించిన కొన్ని యాప్స్ ను, ఇతర సదుపాయాలను జియో ల్యాప్ టాప్ లో ముందే ఇన్ స్టాల్ చేసి అందించనున్నారు. ఇక ఎవరికైన అదనంగా అవసరమైన యాప్స్ ను జియో స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. గట్టి పోటీ ఉన్న ల్యాప్ టాప్ ల మార్కెట్లో జియో ల్యాప్ టాప్ సంచలనం సృష్టిస్తుందని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం జియోకు దేశ వ్యాప్తంగా 42 కోట్ల మంది టెలికం వినియోగదారులు ఉన్నారని, ల్యాప్ టాప్ ల రాకతో జియో మార్కెట్ మరింతగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరో రెండు, మూడు నెలల్లో బహిరంగ మార్కెట్లోకి రావొచ్చని అంచనా వేస్తున్నాయి.