ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న ప్రతిఒక్కరికీ గూగుల్ మెసేజింగ్ యాప్ సుపరిచితమే. గూగుల్ మెసేజింగ్ యాప్ హా..ఇదేం యాప్ అనుకోకండి. ఫోన్లలో నార్మల్ మెసేజ్ చేయడానికి ఉపయోగించే యాపే.. గూగుల్ మెసేజింగ్ యాప్. ప్రస్తుతానికి బ్యాంకు అలెర్ట్స్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే దీనిని ఉపయోగిస్తున్నాం. అదే వాట్సప్,ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా యాపులు రాకముందు అందరూ ఈ యాపునే ఉపయోగించేవారు. ఈ యాప్ నుండే గర్ల్ ఫ్రెండ్స్ తో గంటలు గంటలు ముచ్చట్లేసేవారు.
అయితే.. ఎప్పుడైతే వాట్సప్,ఫేస్‌బుక్ వంటి యాపులు అడుగుపెట్టాయో మెసేజింగ్ యాప్ కి ఆదరణ తగ్గిపోయింది. గూగుల్.. ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడం కూడా ఈ యాప్ ఆదరణ తగ్గిపోవడానికి మరొక కారణం. దీంతో గూగుల్ అదే తరహా ఫీచర్లను అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది. ‘వాట్సాప్’ గ్రూప్ చాట్ తరహాలోనే గూగుల్ మెసేజెస్ లో కూడా గ్రూప్ చాట్ ఫీచర్ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. పరీక్షల అనంతరం సాధారణ యూజర్లకు సైతం అందుబాటులోకి రానుంది.
గూగుల్ మెసేజెస్‌లో గ్రూప్ చాట్ ఫీచర్ ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్’ అనే సెక్యూరిటీతో కనిపిస్తుంది. మెసేజ్ టైప్ చేసిన తర్వాత సెండ్ బటన్ స్థానంలో లాక్ సింబల్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మెసేజ్ అవతలి వారికి వెళుతుంది. ఈ ప్రైవసీ ఫీచర్ సాయంతో ఈ సంభాషణలను సెండర్, రిసీవర్ మినహా ఇతరులెవరూ చదవలేరు. ఈ ఫీచర్‌తో పాటు గూగుల్ మెసేజెస్‌లో ఎమోజీ రియాక్షన్ ఫీచర్‌ను కూడా తీసుకురానుంది. దీంతో యూజర్లు ఇతరులు పంపిన మెసేజ్‌లకు ఎమోజీలతో తమ స్పందన తెలియజేయొచ్చు. ఈ విషయంపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Google Messages is getting this ‘WhatsApp-like’ feature for group chat https://t.co/FJkPpHozwj
— Rikin Trivedi (@Rikins) January 9, 2023