దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తమ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ)పై వడ్డీ రేట్లు పెంచే దిశగా ఆలోచిస్తున్నట్లు సంకేతాలిచ్చింది. తాజాగా జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక రివ్యూలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లకు పెంచిన నేపథ్యంలో.. స్టేట్ బ్యాంక్ ఈ నిర్ణయాన్ని వెలువరించింది.
ఆర్‌బీఐ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 4.90 శాతంగా నిర్ణయించింది. ఫలితంగా పలు రుణాలపై ఈఎంఐ భారం పెరగనుంది. ఆర్‌బీఐ క్రమంగా రేట్లు పెంచుతూ ఉంటే, బ్యాంకులు తమ డిపాజిట్ వడ్డీ రేట్లను కూడా పెంచాల్సి వస్తుంది. దీంతో తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు కొత్త రేట్ల ప్రకారం ఉంటాయనీ, ఇప్పటికే నిర్దిష్ట మెచ్యూరిటీల పై డిపాజిట్ రేట్లను పెంచాలని భావిస్తున్నట్టు ఖరా వెల్లడించారు. కాగా ప్రస్తుతం ఎస్‌బీఐ 12 నెలల – 24 నెలల వ్యవధి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.10 వడ్డీ రేటును అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే మూడు నుండి ఐదు సంవత్సరాల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.45 శాతంగా ఉంది. నూతన ఎఫ్‌డీలపై తాజా వడ్డీ రేట్లు వర్తిస్తాయని, ఇప్పటికే వివిధ కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై తాము వడ్డీరేట్లను పెంచామని ఎస్‌బీఐ చీఫ్ చెప్పారు.
#BTExclusive: Dinesh Kumar Khara, Chairman, SBI, said, “As far as fresh fixed deposits are concerned, they would be according to the new interest rates. We have already increased our deposit rates for certain maturities.”https://t.co/Myy6leLaGn
— Business Today (@business_today) June 9, 2022
ఇది కూడా చదవండి: Banks Employees: సమ్మెకు సిద్ధమైన బ్యాంకు ఉద్యోగులు! ఎప్పటినుంచంటే..?
రెపో రేటు పెరగడం కొంతమందికి భారమైతే..మరి కొంతమంది లాభం కల్గిస్తుంది. గత నెల రోజుల వ్యవధిలో ఆర్బీఐ రెండవసారి రెపో రేటు పెంచింది. ఈ ప్రభావం అటు రుణాలపై, ఇటు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై పడనుంది. ఈఎంఐలు భారంగా మారనుంటే..ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసిన ఖాతాదారులకు అధిక వడ్డీ లభించనుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RBIPolicy Rates:
RBI raises #RepoRate by 50 basis points to 4.90% to control inflation.
Inflation projected at 6.7% in FY22-23.
RBI retains FY23 GDP growth projections at 7.2%.
MSF Rate & Bank rate increased to 5.15% from 4.65%.#MonetaryPolicy #RBIMonetaryPolicy pic.twitter.com/TUVuZrFh6V
— General Knowledge for UPSC (@GuideforAll) June 8, 2022
#StockMarketindia #StockMarket #RBIPolicy #Niftybank #nifty50 #OptionsTrading #Mumbai pic.twitter.com/bg4Ttcpxtq
— Raghu (@ProCloud_) June 10, 2022