ఇప్పుడు ఆన్ లైన్ చెల్లింపులు ఎంతగానో పెరిగిపోయాయి. ఎంత చిన్న మొత్తం అయినా యూపీఐ యాప్స్ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. వాటిలో ముఖ్యంగా పేటీఎంకు ఎక్కువ ఆదరణ ఉంది. పైగా పేటీఎం సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మరికొన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నగదురహిత లావాదేవీల్లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటికే భారత్ లో ఆన్ లైన్ ట్రాన్సక్షన్స్ కోసం ఎన్నో యాప్స్ ఉన్నాయి. వాటిలో పేటిఎంకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎందుకంటే ఎంతోమంది ఆన్ లైన్ పేమెంట్స్, బిల్ పేమెంట్స్ కోసం పేటీఎంని వాడుతుంటారు. ఇది యూజర్ ఫ్రెండ్లీ మాత్రమే కాకుండా.. ఇందులో చాలా ఫీచర్స్ ఉంటాయి. మీరు బిల్స్ గుర్తుపెట్టుకుని కట్టే పని లేకుండా ఆటోమేటిక్ పేమెంట్ చేయచ్చు. క్రెడిట్ కార్డ్ తరహాలో.. పోస్ట్ పెయిడ్ సర్వీసెస్ ద్వారా మీరు ముందు నగదు వాడుకుని తర్వాత పే చేయచ్చు. అలాగే ఇటీవల యూపీఐ లైట్ ఫీచర్ ని కూడా ప్రారంభించారు. ఆ వివరాలను స్వయంగా పేటీఎం సీఈవో వెల్లడించారు.
యాప్స్ ఏవైనా ఆండ్రాయిడ్ కి ఐవోఎస్ డివైజ్ లకు విడి విడిగా ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు పేటీఎం సంస్థ ఆండ్రాయిడ్ తో పాటుగా ఐవోఎస్ యూజర్ల కోసం ఫీచర్స్ తీసుకొచ్చింది. ఆ ఫీచర్ల వివరాలను పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ నిర్వహించి ఒక ఆన్ లైన్ కార్యక్రమంలో సీఈవో విజయ్ శేఖర్ శర్మ వెల్లడించారు. ఫిబ్రవరిలో ప్రారంభమైన యూపీఐ లైట్ ఫీచర్ ఇప్పుడు యాపిల్ ఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా మీ పేటీఎం అకౌంట్ కు రూపే క్రెడిట్ కార్డుని జత చేయవచ్చు. దాని ద్వారా మీరు పేమెంట్స్ కూడా చేసుకోవచ్చు. మీరు చేసే చెల్లింపులకు సంబంధించి వ్యక్తి ట్యాగ్ కూడా చేయచ్చు.
మీరు ఎవరినైనా ట్యాగ్ చేసి చెల్లింపులు చేస్తే.. తర్వాత వాటిని చెక్ చేసుకునే వీలు కూడా ఉంటుంది. అంతేకాకుండా ఇంకో కూల్ ఫీచర్ ని తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీరు చెల్లించే బిల్లుని స్ల్పిట్ చేయచ్చు. ఫ్రెండ్స్ తో కలిసి బయటకు వెళ్లినప్పుడు బిల్ ఒక్కరే కట్టే పని లేకుండా స్ల్పిట్ చేసుకోవచ్చు. అప్పుడు ఎవరి షేర్ ని వాళ్లు కట్టేస్తే సరిపోతుంది. ఇంక యూపీఐ లైట్ గురించి చాలా మందికి తెలియక పోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ యూపీఐ ఖాతాకి రోజుకి రూ.2 వేల వరకు యాడ్ చేసుకోవచ్చు. అలా యాడ్ చేసుకున్న మొత్తాన్ని పేమెంట్ చేయచ్చు. అయితే గరిష్టంగా రూ.200 మాత్రమే పే చేయగలరు. చెల్లింపు చేసేందుకు పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. దీని వల్ల సర్వర్ ఇష్యూ ఉన్నా, బ్యాంక్ రెస్పాడ్ అవ్వకపోయినా పేమెంట్ సక్సెస్ అవుతుంది. పేటీఎం తీసుకొచ్చిన ఫీచర్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.