Gas Cylinder : దెబ్బ మీద దెబ్బ అన్నట్లు అసలే అన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయని బాధపడుతున్న జనానికి మరో షాక్ తగిలింది. డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర ఒక్కసారిగా యాభై రూపాయలు పెరిగిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలో 14.2కేజీల సబ్సీడీలేని డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ. 899.50 నుంచి రూ. 949.5కు పెరిగింది. అన్ని ప్రధాన నగరాల్లోనూ డొమస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలు పెరిగాయి. రాత్రికి రాత్రి ఈ మొత్తం పెరిగిపోయింది. నిన్న ఇచ్చిన బిల్లుల్లో కూడా మార్పులు చేసి, పెంచిన ధర ఇచ్చారు. దీంతో వినియోగదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సిలిండర్ ధరలు పెరగటం అక్టోబర్ 6,2021 తర్వాత ఇదే మొదటిసారి.
సిటీల వారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు
హైదరాబాద్ : రూ. 1002
ముంబై : రూ. 949.50
కోల్‌కతా : రూ. 976
చెన్నై : రూ.965
లక్నో : రూ. 987
పాట్నా : రూ. 1039
19 కేజీల కమర్శియల్ గ్యాస్ సిలిండర్ ధర 2003.50గా ఉంది. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : 2 రూపాయలకే లీటర్ పెట్రోల్.. అందరి చూపు అటువైపే..!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.