ప్రారంభంలో అన్నీ ఫ్రీ.. అంటూ టెలికాం రంగంలో అడుగుపెట్టిన రిలయన్స్ జియో అతి తక్కువ కాలంలోనే కోట్లాది మంది యూజర్లను కొల్లకొట్టింది. కాలానుగుణంగా ఫ్రీ స్కీమ్ ఎత్తివేసి.. టారిప్ ప్లాన్లు తీసుకొచ్చినా.. క్రమంగా ఆ సంస్థ యూజర్ల సంఖ్య పెరుగుతూ పోయింది. దీంతో.. దేశంలోనే అగ్రగామి టెలికం సంస్థగా అవతరించింది.. అయితే, ఇప్పుడు ఆ సంస్థకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2021 డిసెంబర్ నెలలో మొబైల్ యూజర్లు గణనీయంగా అంబానీకి చెందిన రిలయన్స్ జియోకు గుడ్‌బై చెప్పేశారు. ఈ మధ్య కాలంలో ఏకంగా 20 శాతం మేర రీఛార్జ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది జియో. ఇదే, ఆ సంస్థను యూజర్లు వీడడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. జియోతో పాటుగా వొడాఫోన్ ఐడియాకు కూడా ఎదురుదెబ్బ తగిలినట్టు ట్రాయ్ డేటా గణాంకాలు చెబుతున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ క్సహేయండి
డిసెంబర్ 2021 లో దేశవ్యాప్తంగా మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏకంగా 1.28 కోట్లు తగ్గిందని ట్రాయ్ వెల్లడించింది. ఇక, అగ్రగామి టెలికాం సంస్థ అయిన రిలయన్స్ జియో దాదాపు 1.29 కోట్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోయినట్టు పేర్కొంది. డిసెంబర్ 2021లో దాని మొబైల్ సబ్‌స్క్రైబర్‌ల సంఖ్య 41.57 కోట్లకు పడిపోయిందని పేర్కొంది.. ఇదే సమయంలో.. వోడాఫోన్ ఐడియా 16.14 లక్షల మంది మొబైల్ సబ్‌స్క్రైబర్‌లను కోల్పోగా, డిసెంబర్ 2021లో దాని బేస్ 26.55 కోట్లకు చేరినట్టుగా తెలిపింది.. అయితే, జియో, వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఇలా ఉంటే.. మరో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ మాత్రం ఫుల్ జోష్‌లోకి వచ్చింది. ఈ సమయంలో ఎయిర్‌టెల్ 4.75 లక్షల మంది కొత్త యూజర్లను పొంది.. తన వినియోగదారుల సంఖ్యను 35.57 కోట్లకు పెంచుకుంది. మొత్తంగా ఒకప్పుడు జియో అంటే ఎగబడిన జనం.. ఇప్పుడు క్రమంగా ఆ నెట్‌వర్క్‌ను వీడుతుండడం ఆ సంస్థకు పెద్ద తలనొప్పిగా మారుతోంది.
Dear 421 million #OnJio, we share a strong connection. ❤️
To the rest, can we have your number? 😉Don’t mind @airtelindia @ViCustomerCare 👻#HappyValentinesDay #ValentinesDay2022 #WithLoveFromJio
— Reliance Jio (@reliancejio) February 14, 2022