దసరా పండుగ సందర్భంగా చమురు సంస్థలు వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. కమర్షియల్ LPG సిలిండర్ ధరను తగ్గిస్తూ తాజాగా ధరల నోటిఫికేషన్ ను విడుదల చేశాయి. దీంతో కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు పండుగ వేల కొంత ఊరట లభించింది. కంపెనీలు వరుసగా 3వ నెలలో కూడా ఈ ధరలు తగ్గించడం విశేషం. తగ్గిన ధరలను తక్షణమే అమల్లోకి తీసుకొస్తామని గ్యాస్ కంపెనీలు ప్రకటించాయి. అయితే గృహ వినియోగదారులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం తగ్గించలేదు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
ఆయిల్ కంపెనీలు దసరా పండుగ వేళ కమర్షియల్ LPG గ్యాస్ వినియోగదారులకు శుభవార్త చెప్పాయి. గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాయి. తగ్గించిన ధరలు వివిధ నగరాల్లో ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్ లో 19 కేజీల సిలిండర్ పై రూ.36.50 రూపాయలు తగ్గింది. దీంతో రూ. 2,099.5 ఉన్న ధర ఈ తగ్గింపుతో రూ. 2063 కు చేరింది. ఇక వరంగల్ లో రూ. 2102, వైజాగ్ లో రూ. 1908, కలకత్తలో రూ.1959, ఇక ముంబాయిలో రూ.1811.50, ఢిల్లీలో ఈ ధర రూ. 1885 నుంచి రూ. 1859 రూపాయలకు తగ్గింది. ఇదిలా ఉండగా.. గ్యాస్ కంపెనీలు మాత్రం సామాన్య మానవులు వాడే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలను మాత్రం తగ్గించలేదు. పండగ వేళ గ్యాస్ కంపెనీలు ప్రజలకు శుభవార్త చెబుతాయని అందరు భావించారు కానీ వారి ఆశ నిరాశే అయ్యింది. ధరలు తగ్గించక పోవడం అటుంచి గత నెలలో సిలిండర్ పై రూ. 50 పెంచిన విషయం మనకు తెలిసిందే. అంతర్జాతీయ చమురు కంపెనీల విధానాలను బట్టే గ్యాస్ ధరల తగ్గింపు, పెరుగుదలలు ఉంటాయని.. అదీ కాక దేశంలో వివిధ ప్రాంతాల్లో ట్యాక్స్ లను బట్టి ధరల్లో కూడా మార్పులు ఉంటాయని, పెట్రోలియం మంత్రిత్వ శాఖ తెలిపింది.