బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్. ప్రైవేటు రంగానికి చెందిన ఓ ప్రముఖ బ్యాంక్ మార్చి 1వ తేదీ నుంచి కనుమరుగై పోతోంది. ఎలాగోలా ఇన్నాళ్లు నష్టాలు భరిస్తూనే తన కార్యాకలాపాలు కొనసాగించిన ఈ బ్యాంక్, ఇకపై నగర వాసులకు, దేశ ప్రజలకు కనపడదు. ఆ బ్యాంకు ఏంటి..? ఎందుకు మూతపడుతోంది..? వంటి వివరాలు కింద తెలుసుకుందాం..
బ్యాంకింగ్ ఇండస్ట్రీ అంటేనే ఒడిదొడుకులతో కూడుకున్నది. ఎప్పుడు ఏమి జరుగుతుందో..? ఏ రోజు ఏ బ్యాంకు మూతపడుతుందో. ఎందులో విలీనమవుతుందో అంచనావేయడం చాలా కష్టం. నమ్మకం మీద పనిచేసే ఈ బిజినెస్ లో రాణించడానికి ప్రభుత్వ, ప్రయివేట్ శక్తికి మించి పోరాడుతుంటాయి. ఈ క్రమంలో కొన్ని సక్సెస్ అయ్యి విజయవంతంగా సాగుతుండగా, మరికొన్ని మూతపడటం, విలీనం చేయటం వంటివి జరుగుతుంటాయి. ఆ కోవకు చెందిందే ఈ వార్త. ప్రముఖ ప్రయివేట్ బ్యాంకు సిటీ గ్రూప్(సిటీ బ్యాంకు) ప్రస్తానం రేపటితో ముగియనుంది. దీంతో 121 ఏళ్ల చరిత్రకు తెరపడనుంది.
1902లో భారత్ లో తన కార్యకలాపాలు ప్రారంభించిన అమెరికా దిగ్గజ సంస్థ సిటీ గ్రూప్, 1985 నుంచి పూర్తి స్థాయిలో బ్యాంకు సేవలు ఆరంభించింది. అయితే, ఇటీవల పరిణామాలు, బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవసరమైన భారీ పెట్టుబడుల విషయంలో.. విలీనానికి సిద్ధపడింది. ఈ మేరకు ప్రముఖ ప్రయివేట్ బ్యాంక్ అయిన యాక్సిస్ బ్యాంకుతో విలీన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ డీల్ విలువ 12,325 కోట్ల రూపాయలు. దీంతో రేపటి నుంచి సిటీ బ్యాంకు బ్రాంచులన్నీ యాక్సిస్ బ్యాంకులుగా మారనున్నాయి. ఇప్పటికే సిటీ బ్యాంక్.. కోల్‌కతా చౌరింఘీ రోడ్‌లోని ఐకానిక్ కనక్ బిల్డింగ్‌లో తన బోర్డులను తొలగించింది. యాక్సిస్ బ్యాంకులో విలీనం ఒప్పందం 2021కి పూర్తి స్థాయిలో అనుమతులు లభించిన క్రమంలో ఈ మేరకు చర్యలు చేపట్టింది.
విలీన ప్రక్రియలో భాగంగా సిటీ బ్యాంకుల పేరిట ఉన్న ఖాతాలన్నీ యాక్సిస్ బ్యాంకు అకౌంట్లుగా మారతాయే తప్ప సర్వీసుల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని సిటీ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. విలీనంతో బ్రాంచులో అందే సేవవల్లో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపింది. ఖాతాదారుల అకౌంట్లలోని మొత్తానికి ఏ డోకా ఉండదని స్పష్ట చేసింది. ఈ మేరకు కస్టమర్లకు ఇప్పటికే సమాచారం అందించినట్లు వెల్లడించింది. తమ కస్టమర్లను యాక్సిస్‌కు మార్చేందుకు అన్ని చర్యలు సజావుగా చేపట్టామని పేర్కొంది. ఇక సిటీ బ్యాంక్ కు సంబంధించిన కార్పొరేట్, కమెర్షియల్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ బిజినెస్, ట్రెజరీ, ట్రేడ్ సొల్యూషన్లను కొన్ని బ్రాంచుల ద్వారా కొనసాగిస్తామని తెలిపింది. కావున ఖాతాదారులు సిటీ బ్యాంక్ బోర్డులు కనపడట్లేదని ఆందోళన చెందకుండా.. లోపలికి వెళ్లి బ్యాంక్ సిబ్బందిని సంప్రదించండి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
#StocksToWatch | Sources say: Axis Bank is likely to announce the completion of Citibank consumer business acquisition on March 1
Axis Bank to hold a press conference on March 1 at 4:00 PM #AxisBank @AxisBank #Citibank @Citibank #StockMarket pic.twitter.com/kN2mcyHHCS
— ET NOW (@ETNOWlive) February 28, 2023