ఇప్పుడున్న పరిస్థితిల్లో ప్రతి ఒక్కరూ లక్షలు సంపాదించడం అనేది అసాధ్యం. చాలీ చాలని ఆదాయం.. దానికి తోడు పెరిగిపోతున్న రెంటు, కరెంటు బిల్లు, రీఛార్జ్ లు, ఇంటి ఖర్చులు, స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు, ఇవి చాలవన్నట్టు అప్పులు.. ఇలా అనేక బడ్జెట్లతో మధ్యతరగతి, పేదవారి జీవితం తడిసి మోపెడవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కొంత పోగేయాలని ప్రతీ తండ్రి కలలు కంటాడు. లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి కోట్లు సంపాదించలేడు. అలా అని ఈ చాలీ చాలని జీవితంతో సంతృప్తిగా బతకలేడు. కానీ ఉదయం లేచింది మొదలు రాత్రి నిద్రపోయే ముందు క్షణం వరకూ పిల్లల కోసం ఏదో ఒకటి చేయాలన్న తపన అలా ఉండిపోతుంది.
తల తాకట్టు పెట్టినా పనవ్వదు. కనీసం తల వాలినప్పుడైనా కుటుంబానికి అండగా ఒక భరోసా, భద్రత ఉంటే బాగుంటుందనుకునే వారి కోసం ఈ పాలసీ బాగా సూట్ అవుతుంది. కుటుంబ సభ్యుల కోసం లక్షలు అప్పులు చేసి బిజినెస్ లు చేయాల్సిన పని లేదు. నెలకి ఒక 2 వేల రూపాయలు పక్కన పెడితే చాలు. మెచ్యూరిటీ సమయంలో 50 లక్షల దాకా పొందవచ్చు. మీ పిల్లలకి కావచ్చు, మీ కుటుంబ సభ్యులకు కావచ్చు, మీకు కావచ్చు. ఆ అమౌంట్ మీ అందరి తలరాతలను మార్చేస్తుంది. ఇంట్లో పిల్లల కోసం ఆలోచించే తండ్రుల కోసం, ఇంట్లో వారి భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తుల కోసమే ఈ పాలసీ. నెలకు 2 వేల రూపాయలు పొదుపు చేసుకుంటూ వెళ్తే.. మెచ్యూరిటీ సమయానికి దాదాపు 50 లక్షల దాకా పొందవచ్చు. ఎల్ఐసీ పాలసీలో తక్కువ పొదుపు చేస్తూ.. ఎక్కువ ఆదాయం పొందండి.
ఎల్ఐసీ పొదుపు ఖాతాతో పాటు భద్రత కోసం న్యూ ఎండోమెంట్ పాలసీలో ఒకటి అందుబాటులో ఉంది. ఇది నాన్ లింకిడ్ పార్టిసిపేటింగ్ ఇండివిడ్యువల్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ ప్లాన్ లో పొదుపు చేసిన డబ్బుకి భద్రత కూడా ఉంటుంది. ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ పాలసీలో రైడర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఎల్ఐసీ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిజెబిలిటీ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ న్యూ టర్మ్ అష్యూరెన్స్ రైడర్, ఎల్ఐసీ యాక్సిడెంటల్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్, ఎల్ఐసీ ప్రీమియం వీవర్ బెనిఫిట్ రైడర్ వంటి ప్లాన్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఏదో ఒక ప్లాన్ ని ఎంచుకోవచ్చు.
ఎల్ఐసీ న్యూ ఎండోమెంట్ ప్లాన్ లో 8 ఏళ్ల నుంచి 55 ఏళ్ల లోపు వయసున్న వ్యక్తులు ఎవరైనా చేరవచ్చు. మెచ్యూరిటీ సమయం కనీసం 12 ఏళ్ల నుంచి 35 ఏళ్ల పాటు ఉండాలి. కనిష్ట సమ్ అష్యూర్డ్ లక్ష రూపాయలు. గరిష్టంగా ఎంతైనా పొదుపు చేసుకోవచ్చు. అయితే లక్ష రూపాయల సమ్ అష్యూర్డ్ కి వచ్చే డెత్ బెనిఫిట్ ను ఒకేసారి కాకుండా వాయిదాల పద్దతిలో చెల్లిస్తారు. నెలకు 5 వేలు, 3 నెలలకు 15 వేలు, 6 నెలలకు 25 వేలు, ఏడాదికి 50 వేల చొప్పున మెచ్యూరిటీ సమయంలో వచ్చే బెనిఫిట్స్ ని అందజేస్తారు. ఉదాహరణకు 30 ఏళ్ల వయసున్న వ్యక్తి 35 ఏళ్ల పాలసీ టర్మ్ తో లక్ష రూపాయల సమ్ అష్యూరెన్స్ తో పాలసీ తీసుకుంటే.. వార్షిక ప్రీమియం 3 వేల వరకూ పొదుపు చేయాల్సి ఉంటుంది.
మెచ్యూరిటీ సమయానికి దాదాపు 2 లక్షల 50 వేలు వరకూ పొందవచ్చు. అదే 18 ఏళ్ల వయసున్న వ్యక్తి రూ. 10 లక్షల సమ్ అష్యూరెన్స్ తో 35 ఏళ్ల టర్మ్ తో పాలసీలో చేరితే.. వార్షిక ప్రీమియం కింద రూ. 24,391 చెల్లించాలి. అంటే నెలకి రూ. 2,079 పొదుపు చేయాల్సి ఉంటుంది. ఇలా 35 ఏళ్ల పాటు నెలకి రూ. 2,079 చొప్పున పొదుపు చేసుకుంటూ వెళ్తే.. మెచ్యూరిటీ సమయానికి అంటే వయసు 50 ఏళ్లు దాటిన తర్వాత రూ. 48 లక్షల పైనే వస్తాయి. అవి మీకు గానీ, మీ పిల్లలకు గానీ ఉపయోగపడతాయి. మీ పేరు మీదే కాకుండా మీ పిల్లల పేరు మీద కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు. 12 ఏళ్లు లేదా 18 ఏళ్లు వయసు రాగానే పిల్లల పేరు మీద పొదుపు చేసుకుంటూ వెళ్తే.. మెచ్యూరిటీ సమయంలో వారికి 50 లక్షల దాకా అమౌంట్ వస్తుంది.
ఎల్ఐసీలో ఓ పాలసీలో నెలకు రూ.2,000 పొదుపు చేసి రూ.48 లక్షల రిటర్న్స్ పొందొచ్చు.#licpolicy #licplanhttps://t.co/LKTVjh95xi
— News18 Telugu (@News18Telugu) October 26, 2022