పండగ వేళల్లో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలని చాలా మంది భావిస్తుంటారు. ఆరోజున కొంటే శుభమని, పైగా కంపెనీలు కూడా పండగలప్పుడే భారీగా డిస్కౌంట్లు ఇస్తుంటాయి. అందుకే ఎక్కువమంది పండగ సీజన్ లో కొత్త వాహనాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఆయా వెహికల్ కంపెనీలు పండుగ సీజన్ లో కస్టమర్లను ఆకర్షించేందుకు భారీ ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తుంటాయి. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ టూవీలర్ కంపెనీ అయిన కోమకి కూడా ఈ సంక్రాంతికి కస్టమర్ల కోసం అదిరిపోయే ఆఫర్ ను ప్రకటించింది. మీరు ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనాలి అనుకుంటే గనుక.. మీకు ఇది మంచి అవకాశం. 18 వేల వరకూ డిస్కౌంట్ లభిస్తుంది.
ఈ వెహికల్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80 నుంచి 100 కి.మీ. ప్రయాణం చేయవచ్చు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి అయ్యే విద్యుత్ ఖర్చు కేవలం 1.8 నుంచి 2 యూనిట్లు. అంటే యూనిట్ ధర రూ. 6 అనుకున్నా.. 2 యూనిట్లకి రూ. 12 అవుతుంది. 12 రూపాయలతో 100 కి.మీ. ప్రయాణం చేయవచ్చు. పెట్రోల్ తో పోలిస్తే చాలా ఉత్తమం. ఈ స్కూటర్ కి వెనక బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు. సౌకర్యవంతమైన సీటు, సీటు పైకెత్తితే లోపల బూట్ స్పేస్ కూడా ఎక్కువ ఇచ్చారు. స్కూటర్ ముందు భాగంలో కూడా ఫ్రంట్ స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు. అడ్వాన్స్డ్ టీఎఫ్టీ స్క్రీన్, సెల్ఫ్ డయాగ్నోసిస్ రిపేర్ ఫీచర్స్ కలిగి ఉంది.
ఫైర్ రెసిస్టెన్స్ ఫెసిలిటీతో దీని బ్యాటరీని రూపొందించారు. బ్యాటరీలో సెల్స్ ఐరన్ ను కలిగి ఉండడం వల్ల బ్యాటరీ కెమిస్ట్రీ లైపో4 కి మారిపోతుంది. ఎక్స్ట్రీమ్ కేసుల్లో కూడా ఇది ఫైర్ అవ్వదని కంపెనీ తెలిపింది. చాలా సురక్షితమని కంపెనీ ప్రకటించింది. ఇంటీరియర్ పర్మినెంట్ మ్యాగ్నెట్, బ్రష్ లెస్ మోటార్ తో ఈ వెహికల్ వస్తుంది. ఇక గార్నెట్ రెడ్, సక్రమెంటో గ్రీన్, జెట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, బ్రైట్ ఆరెంజ్, సిల్వర్ క్రోమ్.. మొత్తం 6 రంగుల్లో ఈ వాహనం లభ్యమవుతుంది. ఇక ధర విషయానికి వస్తే.. కోమకి కంపెనీ అన్ని మోడల్స్ పై డిస్కౌంట్ ఇస్తోంది. కోమకి వెనిస్ ఎకో మోడల్ పై మాత్రం 18 వేల వరకూ తగ్గింపు అందిస్తోంది. మామూలుగా దీని ధర రూ. 94,800 ఉండేది.
సంక్రాంతి సందర్భంగా ఈ మోడల్ పై 18 వేల రూపాయలు తగ్గించి.. 77 వేల రూపాయలకే కంపెనీ విక్రయిస్తోంది. ఎక్స్ షో రూమ్ ధర రూ. 77 వేలుగా ఉంది. ఆన్ రోడ్ ధర వచ్చేసి రూ. 82,747 ఉంది. 100 కి.మీ. రేంజ్ లో 82 వేల రూపాయల్లో కోమకి వెనిస్ ఎకో స్కూటర్ ఉత్తమం అనే చెప్పవచ్చు. మరి ఎలక్ట్రిక్ వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే గనుక.. ఈ ఎలక్ట్రిక్ వాహనంపై ఓ లుక్కేయండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కొనేవాళ్ళు ఉంటే వాళ్లకి సజెస్ట్ చేయండి. 2 వేలు, 5 వేలు తగ్గింపు ఇస్తున్న తరుణంలో ఏకంగా 18 వేల తగ్గింపుతో ఎలక్ట్రిక్ వాహనాన్ని ఇస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.