‘బిగ్ బాస్ ఓటీటీ’ ప్రోగ్రామ్ లో ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ విషయంలో మాత్రం కొదవ లేదు. వాళ్లల్లో వాళ్లు కిందా మీద పడి కొట్టుకుని మరీ సదరు ప్రేక్షకుడిని అలరిస్తున్నారు. బిగ్ బాస్ ఇంట్లో ఎప్పుడైనా గ్రూపులు ఏర్పడితే గొడవలు జరుగుతాయి. ఈసారి బిగ్ బాసే గ్రూపులు చేసి పంపినప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఏ రేంజ్ లో ఉండబోతోంది అనేది. అందరూ అనుకున్నట్లుగానే లైవ్ స్ట్రీమింగ్ అయినా కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.
మరిన్ని ఆసక్తికర బిగ్ బాస్ ఓటీటీ కథనాల కోసం క్లిక్ చేయండి.
వారియర్స్ మొత్తం కిందా మీదా పడి టాస్కు కంప్లీట్ చేశారు. కానీ, ఛాలెంజర్స్ మాత్రం చావు తెలివితేటలు ఉపయోగించి వారియర్స్ ను బోల్తా కొట్టించారు. రెండు కన్సైన్మెంట్లను సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేశారు. అయితే వారియర్స్ మాత్రం జూనియర్స్ ను కట్టడి చేయలేకపోతున్నారు. మూడో కన్సైన్మెంట్ కూడా కచ్చితంగా విన్ అవుతారు. యాంకర్ శివ రూల్స్ మొత్తం బ్రేక్ చేసే ఆడుతున్నాడు. వాళ్లు చేస్తే తప్పు లేదు మనం ఎందుకు చేయకూడదని అలాగే ఆడుతున్నారు.
ఇదీ చదవండి: యుద్దాన్ని తలపించిన బిగ్ బాస్ హౌస్! కొట్టుకునే వరకు!
ఉదయాన్నే మూడో కన్సైన్మెంట్ కోసం బిందుతో కలిసి యాంకర్ శివ గట్టిగానే వ్యూహాలు రచిచాండు. ఆ తర్వాత స్మోక్ జోన్ లో ఉన్న తేజస్వితో కూడా కాసేపు మాట కలిపాడు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో తేజస్వి మదివాడ స్మోకింగ్ సీన్ ఒక్కటే బాగా హైలెట్ అయ్యింది. ఆమె ఎంతో ప్రొఫెషనల్ గా స్మోక్ చేస్తోందంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. తప్పకుండా అది వారి పర్సనల్ అలవాటు దాని గురించి ఎవరూ కామెంట్ చేయకూడదు. కానీ, ఇలా అందరూ చూసే షోలో స్మోకింగ్ చేస్తూ కనిపించడం ఎంత వరకు కరెక్ట్? వాళ్లు అలా ఉన్న సన్నివేశాలను ఎందుకు ప్లే చేస్తున్నారు? అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.