బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. మరికొన్ని గంటల్లో ఈ బుల్లితెర రియాలిటీ షో ప్రారంభం కానుంది. అప్పుడే సందడి మొదలైపోయింది. కొత్త ప్రోమోలతో నిర్వాహకులు ఆడియన్స్ లో హుషారు పెంచేస్తున్నారు. సెప్టెంబర్ 4న ఈ బిగ్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఈసారి కూడా హోస్ట్‌గా నాగార్జునానే వ్యవహరించనున్నాడు. అందుకు పారితోషకం కూడా గట్టిగానే అందుకున్నట్లు తెలుస్తోంది.
గత నెల రోజులుగా బిగ్ బాస్‌కు సంబంధించి ఎన్నో అప్డేట్లు మరెన్నో ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. వాటిలో అన్నీ నిజం కాకపోయినా కొన్నైతే తప్పకుండా నిజం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే బిగ్ బాస్ 6లో పాల్గొనేది వీళ్లే అంటూ కొందరి పేర్లు బాగా ప్రాచారంలో ఉన్నాయి. వాటిలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు యూట్యూర్, బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి.
అవును ఈసారి కచ్చితంగా ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తున్నట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ అందరినీ ఆకర్షిస్తున్న, ఆకట్టుకుంటున్న అంశం ఏంటంటే.. రివ్యూవర్ గా ఆదిరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. అంతేకాకుండా బిగ్ బాస్ ఆట, అక్కడి రూల్స్, అక్కడ వాళ్లు పెట్టే గేమ్స్ ఇలా అన్నింటిపై ఆదిరెడ్డికి మంచి అవగాహన ఉంది. అంతేకాకుండా ఎవరు ఎలా ఆడితే విజయం సాధిస్తారు? ఎలా ఆడినందుకు ఫలానా వ్యక్తి ఎలిమినేట్ అయ్యాడు లాంటి విషయాలు ఆదిరెడ్డికి బాగా తెలుసు.
అంటే దాదాపు ఆదిరెడ్డికి బిగ్ బాస్ గురించి పూర్తిగా తెలుసు. అదే అతను అందులో సభ్యుడిగా ఇంట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఈ ప్రశ్నే అందరిలో మెదులుతోంది. ఫాలోయింగ్ పరంగా చూసుకున్నా.. ఆదిరెడ్డికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అతని ఛానల్‌కు 3 లక్షలకు పైగా సబ్ స్క్రైబర్లు ఉన్నారు. 5 కోట్లకు పైగా వ్యూవర్ షిప్ ఉంది. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుంటే ఆదిరెడ్డి తప్పకుండా టాప్ 5 వరకు రాగలడని అప్పుడే అంచనాలు కూడా వేస్తున్నారు.
బిగ్ బాస్ 3 నుంచి యాక్టివ్ గా ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూ చేస్తూ వస్తున్నాడు. అంతేకాకుండా హౌస్‌లో ఎలా ఉంటే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాం. ఎలా ఉంటే వారికి నచ్చదు ఇవన్నీ బయట క్లోజ్ చూసిన వ్యక్తి కాబట్టి ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్తే రాణించగలడని చెబుతున్నారు. అయితే బిగ్ బాస్‌ని నమ్మడానికి లేదు. ఆదిరెడ్డి ప్లాన్స్ రివర్స్ అయ్యి.. తొలి వారాల్లోనే ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆదిరెడ్డి బిగ్ బాస్ హౌస్‌లో రాణించగలడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.