బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు.. ఎంతో అట్టహాసంగా ప్రారంభం అయ్యింది. కింగ్ నాగార్జున ఈ సీజన్‌ని కూడా సరికొత్తగా ప్రారంభించాడు. ఇప్పటికే 11 మంది హౌస్‌లో అడుగుపెట్టగా.. 12వ సభ్యురాలిగా హీరోయిన్ వసంతి కృష్ణన్ పాల్గొంది. తాజాగా వాంటెడ్ పండుగాడు సినిమాలో అలరించిన వాసంతి కృష్ణన్ బిగ్ బాస్ అవకాశంతో మరింత మందికి చేరువ కానుంది. ఎంట్రీలోనే నితిన్ సినిమా మాచర్ల నియోజకవర్గంలోని ‘రారా రెడ్డి’ అంటూ ఎంట్రీ సాంగ్‌తో ఇరగదీసింది. వసంతి కృష్ణన్ తిరుపతిలోనే పుట్టి పెరిగింది. ఆమె నటి మాత్రమే కాదు.. మోడల్ కూడా.
తిరుపతిలోనే ఇంటర్ వరకూ చదువుకున్న వాసంతీ.. ఆ తర్వాత ఏవియేషన్ స్టడీస్ కోసం బెంగళూరుకు వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆమె, ఆమె కుటుంబం మొత్తం అక్కడే సెటిల్ అయిపోయారు. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించిన వసంతీ, ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీలోనూ డెబ్యూ చేసింది. వసంతీ కృష్ణన్ జీవితంలో కొన్ని చేదు జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఆమెను హీరోయిన్ చేస్తానంటూ గతంలో మోసం చేసినట్లు పాత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. స్టేజ్ మీద నాగార్జునను చూడగానే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయింది. బిగ్ బాస్ హౌస్ నుంచి గెలిచే వస్తానంటూ ధీమా వ్యక్తం చేసింది. మరి.. వసంతీ కృష్ణన్ గెలుస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.