బిగ్ బాస్ గ్రాండ్ గా ప్రారంభమైంది. మరో 100 రోజులకు పైగా టీవీ ఆడియెన్స్, సోషల్ మీడియా యూజర్స్ కి ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ పక్కా. ఇప్పటికే హౌస్ లో గొడవలు కూడా మొదలైపోయాయి. ఆల్రెడీ నెటిజన్స్ పండగ చేసుకుంటున్నారు. దీనికి తోడు ఓ క్యూట్ గొడవ కూడా తెగ ఆసక్తి కలిగిస్తోంది. అది వింటే మీరు కూడా మనస్ఫూర్తిగా నవ్వుకోవడం గ్యారంటీ. ఓ హగ్ కోసం భార్య భర్తలైన మెరీనా-రోహిత్.. టీజ్ చేసుకుని, నవ్వు తెప్పించేలా గొడవపడ్డారు. నెటిజన్స్ మాటేమో గానీ మిగతా ఇంటి సభ్యులైతే తెగ ఎంటర్ టైన్ అయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ హౌస్ లోకి ఈసారి ఏకంగా 21 మంది అడుగుపెట్టారు. వీరిలో ఓ జోడీ కూడా ఉంది. వాళ్లే టీవీ సీరియల్ యాక్టర్స్ మెరీనా-రోహిత్. వరుణ్ సందేశ్-వితిక జోడీలా హౌస్ లో అడుగుపెట్టిన మెరీనా-రోహిత్.. తమదైన ఎంటర్ టైన్ మెంట్ ఇస్తున్నారు. యాక్టర్స్ గా పరిచయమైన వీరిద్దరూ పెళ్లి చేసుకుని భార్యభర్తలు అయ్యారు. వీరిద్దరి మధ్య బాండింగ్ కూడా అలానే ఉంటుంది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత రోహిత్ మారిపోయాడని మెరీనా క్యూట్ గా గొడవ పెట్టుకుంది.
ఇంట్లో ఒకలా, ఇక్కడ ఒకలా ఉన్నాడని చెప్పింది. నిన్న రాత్రి రోహిత్ తనకు హగ్ ఇవ్వలేదని మెరీనా మారం చేసింది. దీనికి తోడు వర్కౌట్స్ చేద్దామని రోహిత్ ఎంత బతిమాలుతున్నా సరే.. మెరీనా అతడితో వెళ్లలేదు. నువ్వు ఒక్కడివి వెళ్లి చేసుకో అంటూ ఆమె, రోహిత్ ని టీజ్ చేసింది. మిగతా ఇంటి సభ్యులైనా ఆరోహి, శ్రీహాన్, శ్రీ సత్య చెబుతున్నా సరే వీళ్ల గొడవ అలానే కంటిన్యూ అయింది. చూడ్డాడానికి చాలా ఫన్నీగా ఉన్న ఈ గొడవ.. ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ క్యూట్ గొడవ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: హౌస్‌లో గీతూ రాయల్ గలాటా..! అందరినీ వణికించేస్తోంది!