బిగ్ బాస్ ఎపిసోడ్స్ వారమంతా ఎలా ఉన్నాసరే వీకెండ్ వస్తే మాత్రం ఫుల్ కలర్ ఫుల్ గా తయారైపోతుంది. మిగతా రోజులు నార్మల్ డ్రస్సులతో మేకప్ లేకుండా కనిపించే కంటెస్టెంట్స్.. ఆరోజు మాత్రం అందంగా తయారై కూర్చుంటారు. సరే కూర్చున్నారు కదా అని అనుకుంటే పొరపాటు. ఆ వారం రోజులు జరిగిన విషయాలపై హోస్ట్ నాగార్జున కౌంటర్స్ మీద కౌంటర్స్ వేస్తారు. గాలి మొత్తం తీసేశారు. ఇది చూస్తున్నంతసేపు వ్యూయర్స్ పండగ చేసుకుంటున్నారు. తాజాగా రిలీజ్ ప్రోమో చూస్తుంటే వందకు వందశాతం ఇదే అనిపిస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ 6 సీజన్ చూస్తున్న చాలామందికి రిజిస్టర్ అయిన పేరు గీతూ. గత సీజన్లకు యూట్యూబ్ లో రివ్యూలు చెప్పే ఆమె.. ఈసారి పార్టిసిపెంట్ గా ఉందనే సరికి చాలామందికి ఓ రకమైన ఆసక్తి.. ఎలా ఆడుతుందా అని? కానీ వచ్చిన రోజు నుంచే కాస్త ఓవర్ చేసిన గీతూ.. దానికి తగ్గ రిజల్ట్ అందుకుంది. ఈ వారం వరస్ట్ ఫెర్ఫామర్ గా నిలిచి, జైల్లోకి కూడా వెళ్లింది. దీనితోపాటు టాస్కుల్లో భాగంగా కొన్ని షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. ఇప్పుడు వాటి గురించే నాగ్ కౌంటర్స్ వేశారు.
‘హౌస్ లోకి వచ్చి రాగానే ఇది నా కుటుంబం కాదు’ అని గీతూ ఓ సందర్భంలో అంది. వరస్ట్ ఫెర్ఫామర్ టాస్క్ నేపథ్యంలో వాటినే చంటి గుర్తుచేశాడు. గీతూ అలా మాట్లాడటాన్ని తప్పుబట్టాడు. హౌస్ మేట్స్ అందరం కలిసి ఉందమని చంటి అంటే.. ఛాన్సే లేదని గీతూ కుండబద్దలు కొట్టేసింది. ‘ఆటలో గెలవడానికే వచ్చా.. ఎవరితోనూ ఎలాంటి బాండింగ్ ఉండదు’ అని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు దీన్నే పట్టుకున్న నాగ్.. శనివారం ఎపిసోడ్ లో ఎవరేం మాట్లాడుతున్నా గీతూనే పాయింట్ చేస్తూ కౌంటర్స్ వేశాడు. ‘గీతూ నీతో నాకెందుకు పంచాయతీ’ అని ఆమెకి మాట్లాడే అవకాశం లేకుండా కౌంటర్ వేశారు. మరి గీతూ నో ఫ్యామిలీ బాండింగ్, నాగ్ కౌంటర్స్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: గేమ్ స్ట్రాటజీ పేరుతో గీతూ రాయల్ రచ్చ.. లోపల చెయ్యి పెట్టినా..!