ఏ గేమ్ అయినా సరే.. ఎప్పుడూ ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే అస్సలు వీళ్లు పోటీ ఇస్తారా అనుకున్నవాళ్లే ఆటని మలుపు తిప్పేయొచ్చు. వీళ్లు గెలిచే ఛాన్సే లేదు అనుకున్నవాళ్లు.. టాప్ పొజిషన్ లోకి వెళ్లిపోవచ్చు. తమపై విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి నోరు మూసుకునేలా గేమ్ ఆడతారు. వన్ ఆఫ్ ది టాప్ కంటెస్టెంట్ గా మారిపోతారు. మన వింటూ ఉంటాం కదా.. ఓడలు బళ్లు- బళ్లు ఓడలు కావడం అని.. ఇప్పుడు బిగ్ బాస్ లో సేమ్ అలాంటి సీనే కనిపిస్తోంది. తన రేంజ్ ని ఇనయా ఒక్కసారిగా పెంచేసుకుంది. తన గురించే అందరూ మాట్లాడుకునేలా చేసింది. ఇంతకీ ఇదంతా జరగడానికి ఏంటి కారణం?
ఇక వివరాల్లోకి వెళ్తే… నటి ఇనయా సుల్తానా ‘బిగ్ బాస్ 6’లో అడుగుపెట్టినప్పుడు పెద్దగా అంచనాల్లేవు. ఆర్జీవీ బ్యూటీ అనే ట్యాగ్ తో హౌసులో అడుగుపెట్టింది. ఆయనతో గతంలో చేసిన డ్యాన్స్ వీడియో వల్లే ఈమె కొద్దిమందికి తెలుసు. కానీ షో చూసేవాళ్లలో చాలామందికి అసలు ఇనయా ఎవరనేది పూర్తిగా తెలీదు. అలానే హౌసులో అడుగుపెట్టింది. మిగతా కంటెస్టెంట్స్ నుంచిపెద్దగా సపోర్ట్ కూడా ఏం లభించలేదు. తొలివారం దాదాపు ఎలిమినేట్ అయినంత పనిజరిగింది. లక్కీగా సుత్తి పైకెత్తడంతో ఈమె సేఫ్ అయిపోయింది. రెండో వారం నామినేట్ కాలేదు. మూడో వారం నామినేట్ అయినప్పటికీ.. చివరి నిమిషంలో ఓటింగ్ శాతం పెరగడం వల్ల ఎలిమినేషన్ నుంచి ఇనయా తప్పించుకుంది.
ఇక నాలుగో వారం ఇనయాను ఏకంగా తొమ్మిది మంది హౌస్ మేట్స్ అంటే శ్రీహాన్,సుదీప, గీతూ, ఆరోహి, శ్రీసత్య, చంటి, ఆర్జే సూర్య, రోహిత్ అండ్ మెరీనా, కీర్తి నామినేట్ చేసి పడేశారు. ఇంతమంది నామినేట్ చేసినా సరే ఇయనా ప్రతి ఒక్కరు చెప్పిన పాయింట్ ని డిఫెండ్ చేసింది. ఈమె మాట్లాడిన ప్రతిదీ కూడా పక్కాగా ఉండటం ఇనయాకి చాలా ప్లస్ అయింది. దానికి తోడు మూడోవారం చివర్లో జరిగిన ‘పిట్ట’ ఎపిసోడ్, మూడో వారం కెప్టెన్సీ టాస్కులో ఆర్జే సూర్య ఈమెని లాక్కోని తీసుకెళ్లడం లాంటి అంశాలు ఇనయాకు చాలా ప్లస్ అయ్యాయి. బిగ్ బాస్ షో అంటేనే గ్రూపులు ఉంటాయి. ఇలా చూస్తే ఈ సీజన్ లో ఇనయా ఏ గ్రూపులోనూ లేదు. అందరూ ఆమెని ఒంటరి దాన్ని చేశారు. దీంతో వ్యూయర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈమెకి సానుభూతి పెరిగింది. ఇది కూడా ఈమెకి ప్లస్ అయింది. ప్రస్తుతం నామినేట్ అయిన వారి ఓటింగ్ పర్సంటేజ్ తీసుకుంటే.. రేవంత్ తొలిస్థానంలో ఉండగా, ఇనయా ఏకంగా రెండో స్థానానికి ఎగబాకడం విశేషం.
బిగ్ బాస్ ప్రస్తుత సీజన్ లో తొలి మూడు వారాలు కూడా గీతూ లేదంటే రేవంత్ తెగ హడావుడి చేస్తూ కనిపించారు. ప్రోమో, ఎపిసోడ్ లో వాళ్ల గురించే మాట్లాడుకునేలా చేశారు. నాలుగో వారం నామినేషన్స్ తో మాత్రం ఇనయా.. వాళ్లందరి కంటే టాప్ లోకి వెళ్లిపోయింది. చాలామంది ప్రేక్షకులు, ఇనయా జెన్యూన్ గా గేమ్ ఆడుతుందని ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా.. ఇనయాని సపోర్ట్ చేయమని ట్వీట్ చేయడం కూడా ఆమెకి ప్లస్ అయినట్లు కనిపిస్తోంది. ఇక నాలుగో వారం ‘హెటల్ వర్సస్ హోటల్’ టాస్కులోనూ ఇనయా బాగా ఫెర్ఫార్మ్ చేయడం పక్కా అని తెలుస్తోంది! ఒకవేళ ఇదే జరిగితే గత మూడు వారాల్లో మిస్సయిన కెప్టెన్సీ అవకాశం ఆమెకి ఈసారి వచ్చే ఛాన్సులు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇలా రోజురోజుకి క్రేజ్ పెంచుకుంటున్న ఇనయా.. తమకు గట్టి పోటీ ఇస్తుందని భయమో ఏమో కానీ ఈసారి తొమ్మిది మంది ఆమెని నామినేట్ చేసినట్లు కనిపిస్తోంది. మరి ఇనయా క్రేజ్ పెరగడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఆర్జీవీ బ్యూటీని టార్గెట్ చేస్తున్న హౌస్ మేట్స్.. ఎంత తొక్కితే అంత లేస్తున్న ఇనయా సుల్తానా!