బిగ్ బాస్ మొదలై రెండు వారాలైంది. కానీ ఒక్క లవ్ ట్రాక్ కూడా స్టార్ట్ కాలేదేంటా అని ఆడియెన్స్ ఫీలవుతున్నారు. రెండు-మూడు ఎపిసోడ్ లో ఓ ట్రాక్ మొదలైనట్లే మొదలై ఆగిపోయింది. దీంతో జోడీల కోసం తెగ ఎదురుచూస్తున్నారు. ఇలా అందరూ అనుకుంటున్న సమయంలో శ్రీసత్యకి మోడల్ రాజశేఖర్ ప్రపోజ్ చేశాడు. ఇది కాస్త ఇప్పుడు ఎంటర్ టైనింగ్ గా అనిపిస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బిగ్ బాస్ ఆరో సీజన్ మెల్లమెల్లగా ఆడియెన్స్ కి అలవాటవుతోంది.
బిగ్ బాస్ హౌసులో తొలివారం కెప్టెన్ గా బాలాదిత్య చేయగా, రెండోవారం సిసింద్రీ టాస్కుతో పాటు మిగిలిన టాస్కుల్లోనూ మెప్పించిన మోడల్ రాజశేఖర్ కెప్టెన్ అయ్యాడు. ఇక వీకెండ్ కూడా దగ్గరకొచ్చేసింది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ లో భాగంగా ‘ఆ అమ్మాయి గురించి చెప్పాలి’ హీరో హీరోయిన్ సుధీర్ బాబు-కృతిశెట్టి.. హౌసులో అడుగుపెట్టారు. వారిని ఎంటర్ టైన్ చేసేందుకు 21 మంది హౌస్ మేట్స్ నవ్వించే ప్రయత్నం చేశారు. రేవంత్, పోకిరి డైలాగ్ చెప్పి ఆకట్టుకోగా.. శ్రీహాన్ కూడా మహేశ్ మేనరిజం ట్రై చేశాడు. కానీ పక్కనే ఉన్న ఫైమా అతడి గాలి తీసేసింది. గీతూ, ప్రభాస్ లా.. ఆర్జే సూర్య, విజయ్ దేవరకొండలా చేసి చూపించారు.
ఇక శ్రీసత్య చీరకట్టులో అందంగా కనిపించగా.. ‘శారీలో చాలా బాగున్నారు’ అని రాజశేఖర్ ఫ్లర్ట్ చేశాడు. ఇలాంటి డైలాగులు ఎంతమందికి చెప్పావ్ అని శ్రీసత్య కౌంటర్ వేసింది. దీంతో డేట్ కి వెళ్దామా? అని అడిగాడు. ఈ క్రమంలోనే శ్రీహాన్, ఆర్జే సూర్య కూడా వచ్చి.. సత్యతో రాజ్ గురించి మాట్లాడటానికి చూశారు. కానీ సత్య కోప్పడేసరికి వాళ్లు కూడా సైలెంట్ అయిపోయారు. కానీ ఈ ప్రోమో చూస్తుంటే.. కొత్త ట్రాక్ స్టార్టయ్యేలా ఉందే అనిపిస్తోంది. ప్రస్తుతానికి ఇది ఫన్నీగా అనుకున్న రాబోయే ఎపిసోడ్స్ లో రాజ్-శ్రీసత్య మధ్య ప్రేమ చిగురించ్చేమో అనిపిస్తోంది. మరి శ్రీసత్యకు రాజ్ డేటింగ్ ప్రపోజల్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: నేను చేసిన తప్పుకి అమ్మ జీవితాంతం బాధపడుతోంది: శ్రీ సత్య