బిగ్ బాస్ 6 సీజన్ చూసే ఎవరికైనా సరే ఎవరు ఆడుతున్నారో ఎవరు ఆడినట్లు నటిస్తున్నారో తెలిసిపోతుంది. గత సీజన్లతో పోలిస్తే ఈసారి హౌస్ లోకి వచ్చిన వారిలో చాలామంది ప్రేక్షకులకు పెద్దగా తెలీదు. దానికి తోడు తొలి రెండు వారాల్లో ఎపిసోడ్స్ కూడా ఏమంత ఆసక్తిగా జరగలేదు. దీంతో రేటింగ్స్ కూడా తగ్గిపోయాయి. ఫలితంగా తాజాగా పూర్తయిన వీకెండ్ హౌసులో హీట్ పెంచింది. హోస్ట్ నాగార్జున అయితే ఒక్కొక్కరిని నిలబెట్టి మరీ కౌంటర్స్ వేశాడు. ఇందులో శ్రీసత్య ఆటతీరుపైనా ఫైర్ అయ్యారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. సీరియల్స్ తో టీవీ ఆడియెన్స్ కి తెలిసిన శ్రీసత్య ఓ కంటెస్టెంట్ గా అడుగుపెట్టింది. బబ్లీ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. అంతా బానే ఉంది కానీ శ్రీసత్య ఆడినట్లయితే పెద్దగా కనిపించలేదు. ఆడియెన్స్ మైండ్ లో రిజిస్టర్ కూడా కాలేదు. దీనికి తోడు ‘సిసింద్రీ’ గేమ్ లో ఎవరి బొమ్మని వాళ్లు జాగ్రత్తగా కాపాడుకోవాలని బిగ్ బాస్ ఆదేశించారు. అక్కడ కూడా శ్రీసత్య కేర్ లెస్ గా ప్రవర్తించింది. తన బేబీని తీసుకెళ్లిపోయినా సరే తనకేం పట్టనట్లు వ్యవహరించడం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. బిగ్ బాస్ హౌసులోకి వచ్చిన తర్వాత కనీస గేమ్ స్పిరిట్ అయినా చూపించాలి కదా.. ఈమె అది కూడా చేయట్లేదని అనుకున్నారు.
ఇక వీకెండ్ ఎపిసోడ్ లో వచ్చిన నాగార్జున అయితే శ్రీసత్యని ఓ రేంజ్ లో ఆడేసుకున్నాడు. ‘నీ పేరులో సత్య ఉంది. కానీ నీలో సత్యం ఉందా?’ అని హోస్ట్ నాగార్జున సీరియస్ అయ్యాడు. ‘నువ్వు తిండిపై పెట్టే శ్రద్ధ ఆటపై పెట్టడం లేదు’ అని ఫుల్ ఫైర్ అయ్యాడు. ఈమెతో పాటు మిగతా కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుతూ.. ‘మీరు తిని పడుకోవడానికి వచ్చుంటే బిగ్ బాస్ కి అవసరం లేదు. ఇప్పుడే లగేజ్ తీసుకుని వెళ్లిపోండి’ అని నాగ్ సీరియస్ అయ్యాడు. ఇకపోతే శ్రీసత్యకి ఫుడ్ అంటే చాలా ఇష్టం. ఆమె హౌసులో చాలాసార్లు ప్లేట్ లో ఏదో ఒకటి తింటూ కనిపించింది. దీంతో ప్రేక్షకులకు వచ్చిన అభిప్రాయాన్నే నాగ్.. వీకెండ్ ఎపిసోడ్ లో ప్రస్తావించాడు. ఇదిలా ఉండగా గతవారం వరస్ట్ ఫెర్ఫామర్ గా నిలిచిన శ్రీసత్యని జైలులో పెట్టారు. ఇకపోతే ఈ వారం నామినేషన్స్ లో మాత్రం శ్రీసత్య లేనట్లు తెలుస్తోంది. మరి నాగ్ చెప్పిన తర్వాతైనా సరే శ్రీసత్య.. తన తిండిగోల పక్కనపెట్టి గేమ్ పై శ్రద్ధపెడుతుందా అనేది చూడాలి. మరి శ్రీసత్య ఆటతీరుపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: శ్రీ సత్య అందానికి మోడల్ రాజ్ ఫిదా! ఏకంగా ప్రపోజ్!