‘బిగ్ బాస్ 5 తెలుగు’ గురించి ఇంతకాలం జరిగిన ఆడియన్స్ టాక్ వేరు. ఇప్పుడు నడుస్తున్న మౌత్ పబ్లిసిటీ వేరు. బిగ్ బాస్ ఒక టాస్కు ఇచ్చాడు అంటే దాని వెనక ఎంత ఆలోచన ఉంటుందో ఇప్పుడు అర్థమైంది. ప్రేక్షకులతో ప్రశ్నలు అడిగించి. వాటికి సమాధానాలు చెప్పించి ఫుల్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు బిగ్ బాస్. వాటిలో ఇప్పడు మానస్- ప్రియాంక విషయం బయటకు వచ్చింది. ప్రియాంక బయట మానస్ కు ఓట్ చేయండి అంటూ బాగానే ప్రచారం చేస్తోంది. ఆమె అభిమానులను అందరినీ కోరుకుంటోంది మానస్ ను విన్నర్ ని చేయండి అని. కానీ, అలాంటి ప్రియాంకను మానస్ అన్న మాటలు ఆమెనే కాదు.. ప్రేక్షకులను సైతం కలచి వేశాయి. అందుకే దానినే ప్రశ్న రూపంలో అడిగారు. ‘మీరు ప్రియాంకను ఫ్రెండ్ అనుకున్నప్పుడు మరి బ్యాక్ బిచ్చింగ్ ఎందుకు చేశారు?’ అని క్వశ్చన్ చేశారు.
మానస్ సమాధానం: నేను ప్రియాంకను ఫ్రెండ్ అనే అనుకున్నాను. నేను బ్యాక్ బిచ్చింగ్ ఏమీ చేయలేదు. కొన్నిసార్లు ఆమె ప్రవర్తన నచ్చనప్పుడు ఆ విషయాన్ని వేరే వాళ్లతో షేర్ చేసుకున్నా. అలా చేయకుండా ఉండాల్సింది. మీకు అలా అనిపించి ఉంటే క్షమాపణ చేప్తున్నా. ప్రియాంక కూడా నా మాటలకు హర్ట్ అయి ఉంటే ఐ యామ్ సారీ.
ప్రియాంక మానస్ కు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఆమెను చూసి అందరూ ఒక అబ్బాయికి ప్రియాంక లాంటి అమ్మాయి రావాలనే కోరుకున్నారు. అయితే మానస్ ఆమెను ప్రేమించాలని ఎవరూ డిమాండ్ చేయలేదు. ఎందుకంటే కొన్ని సాధ్యాసాధ్యాలు ఉంటాయి. కానీ, ఆమెను ఒక మంచి ఫ్రెండ్ లా ట్రీట్ చేయకుండా అలా ఎందుకు మాట్లాడాడు అనేది వీళ్ల ఆగ్రహానికి కారణం. అయితే మానస్ ఇప్పటికైనా ఆ విషయాన్ని తెలుసుకున్నాడు అనే అనుకుంటున్నారు. ప్రియాంక కూడా ఆ వీడియో చూసి కన్నీటిపర్యంతమైన విషయం తెలిసిందే. ప్రియాంక చేయలేని పనిని ప్రేక్షకులు చేశారు అని కొందరు అంటున్నారు. ప్రియాంక విషయంలో మానస్ చేసింది తప్పేనా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.