బిగ్ బాస్ సీసన్ 5 మొదలైనప్పటి నుండి హౌస్ మేట్స్ పై ఒక్కో అంచనాకి వచ్చేసారు ప్రేక్షకులు. అలా బిగ్ బాస్ లో గట్టిపోటీ ఇచ్చి చివరి వరకు ఉంటాడని అనుకున్న వారిలో యాంకర్ రవి ఒకడు. కానీ హౌస్ నుండి 12వ వారమే రవి ఎలిమినేషన్ జరగడం ఒక సెన్సేషన్. భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా మధ్యలోనే ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. అప్పటినుండి యాంకర్ రవి అభిమానులు ఇదంతా కుట్రతో చేసారంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
అసలు వేరెవరినో గెలిపించడానికి రవిని బలిపశువుని చేయడమెందుకు..? ఓట్ల లెక్కలని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఓ వైపు ఇంత రచ్చ నడుస్తుంటే.. తాజాగా యాంకర్ రవి ఎలిమినేషన్ పై మరో కొత్త కారణం వెలుగులోకి వచ్చింది. రవి ఎలిమినేషన్ వెనుక యాంకర్ శ్రీముఖి హస్తం ఉందంటూ నెటిజన్లు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. యాంకర్ రవి హౌస్ నుండి బయటికి రావడానికి శ్రీముఖి పాత్ర కీలకంగానే ఉందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో మంచి స్నేహితులైన యాంకర్ రవి, శ్రీముఖి.. వారి మధ్య మనస్పర్థలు కారణంగానే దూరమయ్యారు. ఆ పాత కక్షలతోనే రవిని బిగ్ బాస్ నుండి వెళ్లిపోయేలా శ్రీముఖి ప్లాన్ వేసిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ ఇంటికి సంబంధించి ప్రముఖ వ్యక్తితో శ్రీముఖికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అతని సహాయంతోనే శ్రీముఖి రవిని బయటికి పంపిందని రవి ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి ఇప్పటివరకు రవి, శ్రీముఖి ఇద్దరూ ఈ వార్తలపై స్పందించలేదు. వారి నుండే క్లారిటీ రావాల్సి ఉంది. మరి యాంకర్ రవి ఎలిమినేషన్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలపండి.