‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ వారాల నుంచి రోజుల్లోకి వచ్చేసింది. ఇంట్లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. ఈ వారం ఇంకొకళ్లు ఎలిమినేట్ అయ్యి టాప్- 5 మాత్రమే మిగులుతారు. నిన్న మొన్న వరకు ఆర్జే కాజల్ ఎలిమినేట్ అవుతుంది అని వినిపించిన మాటలు ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఇప్పడు సిరి హన్మంత్ పేరు బాగా వినిపిస్తోంది. ఫ్యాన్ బేస్ గురించి పక్కన పెడితే చివరి రోజుల్లో సిరిపై నెగెటివ్ ప్రచారం ఎక్కువ జరిగిందని తెలుస్తోంది. అది కాజల్ కు ప్లస్ అయినట్లు కనిపిస్తోంది.
బిగ్ బాస్ హౌస్ లో టాస్కుల విషయంలో సిరిని ఎవరూ తక్కువ చేసి మాట్లాడరు. టాస్కు అనగానే ఆమె 100 శాతం ఎఫర్ట్ పెడుతుందని ఇంట్లోని సభ్యులు అందరూ ఒప్పుకున్న మాటే. కానీ, ఆమెకున్న ఎమోషనల్ కనెక్షన్ ఇప్పుడు ఆమె కొంప ముంచినట్లు భావిస్తున్నారు. సిరికి షణ్ముఖ్ తో రిలేషన్ ఇన్నాళ్లు ప్లస్ అనుకున్నారు. అసలు ఆ రిలేషనే ఇప్పుడు ఆమెను హౌస్ నుంచి ఎలిమినేట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది. గత కొన్ని వారాలుగా వారి రిలేషన్ పై బాగా నెగెటివ్ టాక్ నడుస్తోంది. సిరి తల్లి వచ్చినప్పటి నుంచి అది ఇంకాస్త పెరిగింది. ప్రతి సీన్ లో సిరి తల్లిని ప్రస్తావిస్తూ వారి పద్ధతి మార్చుకోకుండా చేస్తున్న పనులు తెలుగు ప్రేక్షకులను కోపానికి గురి చేశాయని సోషల్ మీడియా టాక్.
ఫ్రెండ్ షిప్ హగ్, ఎమోషనల్, ఇష్టం ఇలాంటి మాటలు సిరిని చాలా డీఫేమ్ చేశాయనే చెప్పాలి. ఇప్పుడు అదే ఎలిమినేషన్ వరకు దారి తీసిందంటున్నారు. షణ్ముఖ్ కూడా ‘నువ్వు వెళ్లిపోతే నేనెలా ఉంటానురా? నా పరిస్థితి ఏంటి’ అని ప్రశ్నించడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. ఎవరి పరిస్థితి ఏదైనా.. కాజల్ కిస్మత్ బాగుందని టాక్. 11వ వారం ఎలిమినేషన్ లో జెస్సీ వచ్చేసి కాపాడితే.. ఇప్పుడు సిరి స్వయంకృపరాధం కాజల్ కు కలిసొచ్చిందని చెప్పుకుంటున్నారు. మరి సోషల్ మీడియా ఒపీనియన్ ఎంత వరకు నిజం అవుతుందో తెలియాలంటే ఆదివారం దాకా ఆగాల్సిందే. సిరి హన్మంత్ ఈ వారం ఎలిమినేట్ అవ్వబోతోందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.