‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ టైటిల్ విన్నర్ గా వీజే సన్నీ అవతరించిన విషయం తెలిసిందే. బిగ్ బాస్ తో సన్నీ కోటీశ్వరుడయ్యాడు అని సోషల్ మీడియా టాక్ నడుస్తోంది. కానీ, నిజంగా సన్నీ అంత అందిందా? అసలు సన్నీ ప్రైజ్ మనీలో కోతలెంతో తెలుసా? తెలిస్తే షాకవ్వాల్సిందే.
సన్నీ రెమ్యూనరేషన్, ప్రైజ్ మనీ రూ.50 లక్షలు, ప్లాట్ రూ.25 లక్షలు, బైక్ రూ.లక్షన్నర ఇలా అన్నీ కలిపితే సన్నీకి రూ.కోటిపైనే వస్తాయి. అంటే సన్నీ కోటీశ్వరుడు అయినట్లే. కానీ ఇది చెప్పుకోవడానికి మాత్రమే. అసలు లెక్కల ప్రకారం సన్నీ లక్షాధికారి మాత్రమే కాగలడు. అవును విన్నర్ గా సన్నీ గెలుచుకున్న దాంట్లో ట్యాక్సులు భారీగానే పడతాయి.
నిజానికి టీవీ రియాలిటీ షోలలో ప్రైజ్ మనీగా రూ.10 వేలకు మించి ఎంత గెలుచుకున్నా కూడా దానిపై ప్రభుత్వానికి పన్ను కట్టాల్సి ఉంటుంది. అది కూడా సాదాసీదా పర్సంట్ కాదు. గెలుచుకున్న మొత్తంలో అక్షరాలా 31.2 శాతం పన్ను కింద కట్టాలి. అంటే మొత్తం సన్నీకి రూ.కోటి వచ్చింది అనుకుందాం. కానీ, పన్నులు పోను సన్నీ వచ్చేది దాదాపు రూ.77 లక్షలు మాత్రమే. అందుకే సన్నీ చెప్పుకోవడానికే కోటీశ్వరుడు.. వాస్తవంలో లక్షాధికారినే. అయితే బిగ్ బాస్ తర్వాత సన్నీ కెరీర్ పరుగులు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. హీరోగా సినిమా కూడా రాబోతోంది. మరో మూడు నెలల్లో బిగ్ బాస్ 6 తెలుగు సీజన్ కూడా మొదలవుతుందని నాగార్జున చెప్పకనే చెప్పాడు. విన్నర్ సన్నీపై మీ అభిమానాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.