‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ గ్రాండ్ ఫినాలే కోసం ముస్తాబవుతోంది. మొదటి ఫైనలిస్ట్ శ్రీరామచంద్ర మినహా అందరూ నామినేషన్స్ లో ఉన్నారు. ఇంట్లోని కంటెస్టెంట్లు అందరూ ఫ్యాన్స్ దగ్గరే తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలంటూ బిగ్ బాస్ సూచిస్తూ.. అందరినీ నేరుగా నామినేట్ చేశాడు. దాదాపు అన్ని వారాల్లో నామినేషన్స్ లో ఉన్న షణ్ముఖ్ మరోసారి నామినేషన్స్ లోకి వచ్చాడు. షణ్ముఖ్ బేసిక్ గా ఫ్యాన్స్ బేస్ ఎక్కువ. ట్విట్టర్ లో హ్యాష్ ట్యాగులతో ఒక విధ్వంసమే సృష్టింటారు. ఇప్పుడు వారికి హీరో సూర్యా ఫ్యాన్స్ కూడా తోడయ్యారు. షణ్ముఖ్ ను విన్నర్ ని చేసే బాధ్యత మాది అంటూ భరోసా కల్పిస్తున్నారు. షణ్ముఖ్ కోసం బిగ్ బాస్ 5 తెలుగు చూడటమే కాదు.. ఓట్లు వేయడం, ట్విట్టర్ లో ట్రెండింగ్ చేయడంలోనూ వారి పాత్ర ఎంతో ఉంది.
తెలుగు ప్రేక్షకుల్లో కలుగుతున్న ఒక అనుమానం ఎంటంటే.. అసలు సూర్యా ఫ్యాన్స్ షణ్ముఖ్ కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం కూడా లేకపోలేదు. షణ్ముఖ్ కు హీరో సూర్య అంటే చాలా ఇష్టం. షణ్ముఖ్ ఇన్ స్పిరేషన్ హీరో సూర్య అని గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు హీరో సూర్య ద్వారా గుర్తించబడాలి అనేది షణ్ముఖ్ డ్రీమ్స్ లో ఒకటి. అందుకే ఇప్పుడు సూర్యా ఫ్యాన్స్ షణ్ముఖ్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఒకవేళ షణ్ముఖ్ టైటిల్ గెలిస్తే.. అతి పిన్న వయస్కుడిగా అతను రికార్డుల కెక్కుతాడు. 27 ఏళ్లకే ఒక రియాలిటీ షో విన్నర్ కావడం రికార్డే అవుతుంది. అయితే ఆ అవకాశం కూడా లేకపోలేదు. సూర్యా ఫ్యాన్స్ సపోర్ట్ తో షణ్ముఖ్ అభిమానుల్లో కొత్త ఉత్సాహం వచ్చింది. షణ్ముఖ్ జశ్వంత్ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కాగలడా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.