‘బిగ్ బాస్ 5 తెలుగు’ విన్నర్ సన్నీ ఫుల్ బిజీ అయిపోయాడు. అభిమానులను కలవడం, కార్యక్రమాల్లో పాల్గొనడం ఒకటా రెండా విన్నింగ్ మూమెంట్స్ ను ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు. సినిమాలో అవకాశాలు కూడా వచ్చేశాయి. బిగ్ బాస్ మొత్తం సన్నీ లైఫ్ నే మార్చేసింది. ఎంత మార్చిందంటే.. మా అమ్మాయిని చేసుకో మా అమ్మాయిని చేసుకో అంటూ క్యూలు కడుతున్నారంట. ఒక ఎన్నారై మహిళ అయితే నా కూతురిని చేసుకో అని వీడియో కాల్ తెగ ఇబ్బంది పెట్టేసిందంట. సన్నీ మాత్రం సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. అది కూడా న్యూసా? మీకు ఇంక ఏం లేవా అని అనుకోకండి. ఆవిడ ఆఫర్ చేసిన కట్నం తెలిస్తే షాకవుతారు. వాళ్ల కూతురితో పాటు అక్షరాలా రూ.వంద కోట్ల ఆఫర్ ఇచ్చారంట.
ఆ ఎన్నారై మహిళ వీజే సన్నీకి మంచి అభిమాని. సన్నీతో మాట్లాడేందుకు కాల్ చేసింది. మాటల సందర్భంలో పెళ్లి ప్రసావన వచ్చింది. ‘అవును సన్నీ నా కూతురిని చేసుకో. అమ్మాయిని చూస్తే వదిలిపెట్టవు. చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రేమలు ఇవన్నీ పెట్టుకోకు. నా కూతురు తొందర్లో ఇండియా వస్తోంది. ఒకసారి కలువు.. ఫొటోలు పంపిస్తాను. మాకున్న రూ.100 కోట్ల ఆస్తి నీకే ఇచ్చేస్తాం’ అంటూ తెగ ఇబ్బంది పెట్టేసిందంట. మా కళావతిని కట్నం అలాంటివి నచ్చవు అంటూ సున్నితంగా తిరస్కరించాడని టాక్. అలా విన్నర్ అయ్యాడో లేదో అప్పుడే రూ.వంద కోట్ల ఆఫర్ అంటే మామూలు విషయం కాదంటూ ఆశ్చర్యపోతున్నారు. సన్నీకి వచ్చిన క్రేజీ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.