‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో ఇప్పుడు అంతా ఒకటే చర్చ విజేత ఎవరు? ఎవరు బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ కాబోతున్నారు? ఆ ప్రశ్నకు సమాధానం తెలిసేందుకు ఇంకా వారం రోజుల సమయం ఉంది. ఈలోగా ప్రేక్షకులు అందరూ తమ అభిమాన కంటెస్టెంట్లే గెలుస్తారంటూ ప్రచారాలు చేసుకుంటున్నారు. అంచనాల ఆధారంగా అసలు సిరి హన్మంత్ బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ కాగలదా? సాధ్యాసాధ్యాల గురించి పరిశీలిద్దాం.
‘సిరి హన్మంత్’ అనే పేరు వినగానే హౌస్ మేట్స్ అందరూ పటాకా, టాస్కుల్లో రాక్షసి, తన 100 శాతం ఇస్తుంది, నెవర్ గివప్ మెంటాలిటీ అనే బిరుదులు వచ్చాయి. కానీ, సీజన్ మొదటి నుంచి ఈరోజు వరకు కూడా సిరికి ఎంత పాజిటివిటీ ఉందో.. అంతే నెగెటివిటీ కూడా ఉంది. అదే షణ్ముఖ్ తో రిలేషన్ విషయంలో.. బయట చాలానే చర్చ జరిగింది. విషయం ఏంటంటే.. అంత నెగెటివిటీ స్ప్రెడ్ అయినా కూడా ఆమె ఎలిమినేట్ కాలేదు. దాదాపు అన్ని వారాల్లో నామినేషన్స్ లో ఉన్న సిరి ప్రతిసారి సేవ్ అయ్యింది.
ఇప్పుడు అందరి ప్రశ్న ఇదే.. ఆ హగ్గులు, ముద్దులే సిరి హన్మంత్ కు ప్లస్ అయ్యాయా? నార్మల్ గా సిరి తన ప్రియుడు శ్రీహాన్ తో చేసే వెబ్ సిరీస్ ల ద్వారా ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ అవకాశాన్ని అంది పుచ్చుకుంది. వెబ్ సిరీస్ ల ద్వారా సిరికి వచ్చిన ఫ్యాన్ బేస్ కొద్దిగే అని చెప్పాలి. కానీ, బిగ్ బాస్ హౌస్ లో తనకన్నా ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న వారిని కూడా సిరి డామినేట్ చేసింది. ఆ విధంగా చూసుకుంటే సిరికి నెగెటివిటీనే ప్లస్ అయ్యిందేమో అనే అనుమానం కలగమానదు. షణ్ముఖ్ తో రిలేషన్ ద్వారానే ఆమె ఇంత ఫేమస్ అయ్యిందనే భావన కలుగుతోంది.
ఇప్పుడు అదే స్వింగ్ లో ప్రేక్షకులు ఆమెకు ఓట్లు వేస్తున్నారు అంటున్నారు. టాప్-5లో అడుగుపెట్టడానికి కూడా అదే కారణం అంటున్నారు. అదే నిజం అయితే బిగ్ బాస్ తెలుగులో తొలి లేడీ విన్నర్ సిరి హన్మంత్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న స్వింగ్ ఇలాగే కొనసాగితే సిరిని విజేతగా చూసే అవకాశం కూడా కలుగుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. సిరి హన్మంత్ బిగ్ బాస్ 5 తెలుగు విన్నర్ కాగలదా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.