బిగ్ బాస్ 5 తెలుగు సీజన్ లో కంటెస్టెంట్ లకు యాంకర్ రవి గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఉన్నట్టుండి ఎవరు ఊహించిన విధంగా రవి ఎలిమినేట్ అయ్యాడు. దీంతో ఒక్కసారిగా ఆయన ఫ్యాన్సే కాకుండా మిగత కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ కూడా షాక్ కు గురయ్యారు. ఇక రవి ఎలిమినేట్ అనంతరం తన ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. రవిని కావాలనే ఎలిమినేట్ చేశారని, అంతిమంగా విన్నర్ రవినే అంటూ ఆయన ఫ్యాన్స్ బయట రచ్చ రచ్చ చేసిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే రవిని వైల్డ్ కార్డ్ ఏంట్రీ ద్వారా మళ్లీ హౌస్ లోకి పంపనున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరో విషయం ఏంటంటే..? హైస్ నుంచి ఎలిమినేట్ అయిన అనంతరం యాంకర్ రవి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో రవి మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తరువాత నా భార్య నిత్యతో పాటు నా కూతురు వియతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. అయితే నేను హౌస్‌లో ఉన్నప్పుడు బయట ఏం జరిగిందో చాలా విషయాలు తెలుసుకున్నాను.
నిజమేనా అని వాటిని నమ్మలేకపోతున్నానని అన్నాడు. నా ఫ్యామిలీపై అనవసరంగా నెగిటివ్ ట్రోల్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటానని, ఖచ్చితంగా అలాంటి డాష్ గాళ్లపై చర్యలు సైబర్ క్రైమ్ ను ఆశ్రయించి ట్రోలర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటానని తెలిపాడు. హౌస్ లో నా ఆట తీరు నచ్చకపోతే వదిలేయాలి. కానీ ఇలా ఫ్యామిలీ జోలికి రావ్వద్దంటూ అంటూ యాంకర్ రవి భావోద్వేగానికి లోనయ్యాడు. మరి రవి నిజంగానే ట్రోల్స్ చేసిన వారిపై చర్యలు తీసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.