‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ నుంచి ఎలిమినేట్ అవ్వడం అటు రవికే కాదు.. ఇంట్లోని సభ్యులు, ఇప్పటికే ఇంటి నుంచి బయటకు వచ్చిన సభ్యులకు కూడా షాక్ గానే ఉంది. ముఖ్యంగా రవి అభిమానులు, బిగ్ బాస్ ప్రేక్షకులు అందరూ ఎంతో షాక్ లో ఉన్నారు. రవి ఎలిమినేషన్ ఫేక్ అంటూ నిరసనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు రవి ఎలిమినేషన్ లో నిజంగానే ఏదో జరిగింది అంటూ గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఓ పెద్ద వ్యక్తి హస్తం ఉందంటూ కామెంట్ చేస్తున్నారు.
రవిని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు. అదే నిజం అని కూడా కొందరు వాదిస్తున్నారు. బిగ్ బాస్ షోకు సంబంధించిన ఒక పెద్ద వ్యక్తికి రవికి మొదటి నుంచి పడదు అనేది వారి ఆరోపణ. అందుకే రవిని టార్గెట్ చేసి బిగ్ బాస్ షో మొత్తంలో రవిని బ్యాడ్ చేయాలని బాగా ట్రై చేశారంటూ ఆరోపిస్తున్నారు. మొదట షోను నడింపించుకోవడానికి రవి ఫేమ్ ను వాడుకున్నారని.. ఇప్పుడు లాస్ట్ మూడు వారాలకు చేరుకునే సరికి ఇలా రవిని టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారని ఆరోపిస్తున్నారు. రవిని మొదటి నుంచి నెగెటివ్ చేయాలని చూశారన్నారు. ‘ఇండస్ట్రీలో ఉండే వ్యక్తికి తోటివారే అలా జంతువుల పేర్లు పెట్టి టార్గెట్ చేశారంటూ’ రవి తల్లి కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ అన్నింటికి ఆ ఒక్క వ్యక్తే కారణం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రవి అభిమానుల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. రవిని తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలు, నిరసనలపై బిగ్ బాస్ యాజమాన్యం వైపు నుంచి ఎలాంటి స్పందన లేదు. వారు వీటిని ఖండించిందీ లేదు. రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర జరిగిందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.