‘బిగ్ బాస్ 5 తెలుగు’ సీజన్ లో సిరి- షణ్ముఖ్ పేర్లు అయినంత ఫేమస్ బిగ్ బాస్ కూడా అయి ఉండడు. వాళ్ల మధ్య ఉన్నది ఫ్రెండ్ షిప్పో, వ్యామోహమో, ప్రేమో వాళ్లకే కాదు.. ఎవరికీ క్లారిటీ లేదు. అప్పుడే ఇష్టం అంటారు. అప్పుడే ఫ్రెండ్ షిప్ అంటారు. వీటి మీద నటి మాధవీలత మరోసారి విరుచుకుపడింది. ఇన్ స్టాగ్రామ్ పోస్టులో సిరిని ఏకిపారేసింది. అటు షణ్ముఖ్ ని కూడా సెటైరిక్ ప్రశ్నలతో ఆడుకుంది.
‘ఒక అమ్మాయిని ఇలా అనాల్సి రావడం బాధగా ఉంది. కానీ, ప్రవర్తన ముఖ్యం. అది బాగాలేనప్పుడు జెండర్ తో పనిలేదు. సిరిది సిగ్గులేని జన్మ, ఆఫర్స్ కోసం దిగజారిన బతుకు. ఎన్ని తిట్టినా వెళ్లి మళ్లీ మాట్లాడుతోంది. అది లవ్ అది ప్యూర్ స్నేహం. అలా చేస్తే మొగుడకి కూడా పెళ్లాం వంచి వాత పెట్టి పైత్యం తగ్గిస్తుంది. ఓట్ల కోసం.. ఉంటే వచ్చే నోట్ల కోసం ఒక మనిషి ఇంతలా దిగజారం. ఓపెన్ గా తల్లిని అవమానించడం పద్ధతి కలిగిన మంచి అమ్మాయి. ఒక లస్ట్ కోసం అమ్మని, పార్టనర్ ని కేర్ చేయని ఒక మంచి పిల్ల. సరేలే పైసల్ కావలిగా పోనీలే పాపం. ఫ్రెండ్ లో అమ్మా నాన్నా కనిపించాలి. పార్టనర్ కనిపించడం ఏంటి తల్లి’ అంటూ చురకలు అంటించింది.
మరోవైపు షణ్ముఖ్ జశ్వంత్ ని కూడా ఆడుకుంది. ‘నన్ను ఇమిటేట్ చేయకూడదు నాకు నచ్చదు అంటున్నాడు. మరి శ్రీరామ్ డ్యాన్స్ చేశాడా? వెకిలిగా శ్రీరామ్ డ్యాన్స్ చేస్తున్నట్లు ఎందుకు ఇమిటేట్ చేశాడు. శ్రీరామ్ ఫీల్ అయ్యాడా? అది స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. నీతులు పక్కనోళ్లకి చెప్పడం కాదు. ఇంకా సెక్యూరిటీ గార్డులా కాపాడుతున్నాడంట. మరి హౌస్ లో ఉన్న మానస్, సన్నీ, శ్రీరామ్ కామ పిశాచులు మరి. హగ్గుల కోసం అల్లాడి పోతున్నారు. అందుకే అన్నయ్య అని పిలిపించాడు.
ఫ్రెండ్ అయితే పక్కనోళ్లని అన్నయ్య అని ఎందుకు పిలిపిస్తాడు. నాకు మెసేజ్ చేసిన అమ్మాయిలకు అలాంటి మొగుడు, అబ్బాయిలకు అలాంటి మెంటాలిటీ ఉన్న పెళ్లాం రావాలని బ్లెస్ చేస్తున్నా. జీవితాతం అనుమానం అనే నరకంతో చావండి’ అంటూ రాసుకొచ్చింది. ఇదంతా మాధవీలత ఎందుకు చేస్తుందో ఒక క్లారిటీ అయితే ఇచ్చింది. ఎవరి ఫ్యాన్ అయితే ఆమెకు నెగెటివ్ మెసేజ్ లు చేస్తున్నారో. వాళ్ల అభిమాన కంటెస్టెంట్ గురించి పది ఇరేటింగ్ పోస్టులు పెడతా అంటూ వార్నింగ్ ఇచ్చింది.