YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పేద ప్రజల పాలిట కొంగు బంగారంగా మారుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చే కల్ప తరవుగా దర్శనిమిస్తున్నారు. మేనిఫేస్టోలో ఇచ్చిన హామీలను 98.44 శాతం నెరవేర్చటమే కాదు.. ‘ మాకు సాయం కావాలి’ అన్న వారికి నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. భరోసా ఇవ్వటమే కాదు.. వీలైనంత త్వరగా వారికి సాయం చేస్తున్నారు. తాజాగా, ఓ పేద యువతి తన కలను సాకారం చేసుకోవటానికి సీఎం జగన్ సాయం చేశారు. వ్యోమగామి కావాలన్న ఆమె కలకు ఊపిరి పోశారు. పర్యటనలో హామీ ఇవ్వటమే కాదు.. నెల రోజుల్లోనే సదరు యువతికి సాయం అందించారు. వ్యోమగామి చదువు కోసం 50 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని ఇచ్చారు.
వివరాల్లోకి వెళితే.. రాజమండ్రి పట్టణానికి చెందిన దంగేటి జాహ్నవికి చిన్నప్పటినుంచి వ్యోమగామి కావాలనేది కల. ఆ లక్ష్యంతోనే నాసాతో పాటు పోలాండ్‌లో అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణ పొందింది. అయితే, వ్యోమగామి అవ్వాలంటే అంతర్జాతీయ సంస్థలో పైలెట్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఇందుకోసం భారీగా ఖర్చవుతుంది. కానీ, అందుకు ఆమె కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిపోదు. దీంతో ‘నా ఆశలు అడియాశలు అవ్వాల్సిందేనా’ అనుకుని కుమిలిపోయింది. ఈ నేపథ్యంలోనే గత వరదల సమయంలో రాజమండ్రి పట్టణంలో పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రిని కలిసి తన సమస్యను చెప్పుకుంది.
ఆయన సానుకూలంగా స్పందించారు. నెల రోజుల్లోనే రూ. 50 లక్షల ఆర్థిక సాయం అందించారు. బుధవారం రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం, సినిమాటోగ్రఫీ మంత్రి సీహెచ్. శ్రీనివాస వేణు గోపాల కృష్ణ.. ముఖ్యమంత్రి మంజూరు చేసిన రూ. 50లక్షల చెక్కును దంగేటి జాహ్నవికి అందజేశారు. ఈ సందర్భంగా దంగేటి జాహ్నవి మాట్లాడుతూ.. ‘‘ నాకు వ్యోమగామి అవ్వాలనే తపన ఎంతగానో ఉంది. నేను పంజాబ్‌లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాను. వ్యోమగామి అవ్వాలనే లక్ష్యంతోనే నాసాతో పాటు పోలాండ్‌లో అనలాగ్ ఆస్ట్రోనాట్ శిక్షణ పొందాను.
అయితే, వ్యోమగామి అవ్వాలంటే అంతర్జాతీయ సంస్థలో పైలెట్ శిక్షణ పొందాల్సి ఉంటుంది. కానీ, అందుకు నా కుటుంబ ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. అందుకే ఆర్థిక సహాయం నిమిత్తం ముఖ్యమంత్రిని కలిశాను. ఆయన వెంటనే సానుకూలంగా స్పందిస్తూ నెల రోజుల కాలవ్యవధిలోనే రూ.50 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి అందించిన ఈ సహాయాన్ని ఎన్నటికీ మరువలేను. వారి దీవెనలతో త్వరలోనే ఈ శిక్షణా కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తా’’ అని ఆమె తెలిపారు. మరి, యువతి కలను సాకారం చేయటానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భారీ సాయాన్ని అందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Muscat: వీడియో: గల్ఫ్ కష్టాలు.. సెల్ఫీ వీడియోలో మహిళ కన్నీరు!