చిన్నకారణాలకే బలవన్మరణాలకు దిగుతున్నారు. దీనికి సామాన్యులే కాదూ రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు అతీతం కాదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇతర కారణాలతో వీరు మృత్యువును ఆహ్వానిస్తున్నారు.
కొంత మంది క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. చిన్నకారణాలకే బలవన్మరణాలకు దిగుతున్నారు. దీనికి సామాన్యులే కాదూ రాజకీయ, క్రీడా, సినీ ప్రముఖులు అతీతం కాదు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇతర కారణాలతో వీరు మృత్యువును ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు అనేక మందిని ఆత్మహత్యకు పురిగొల్పేలా చేస్తున్నాయి. మనస్థాపం చెందిన కొందరు ఉరి కొయ్యలకు వేలాడుతున్నారు. అందమైన జీవితాన్ని అర్థంతరంగా అందులో బలవంతంగా అంతం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళా సర్పంచ్.. బలవన్మరణానికి పాల్పడింది.
ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం పంచాయతీ సర్పంచి బాదం ధనలక్ష్మి(45) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే కుటుంబ కలహాలే ఇందుకు కారణాలని తెలుస్తోంది. ధనలక్ష్మి గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా బరిలో దిగి.. సర్పంచిగా ఏకగ్రీవమయ్యారు. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. ధనలక్ష్మి భర్త చిన్నరెడ్డి ఇతర కుటుంబసభ్యులతో కలిసి పల్నాడు జిల్లా అడిగొప్పల నీలంపాటి అమ్మవారి ఆలయానికి వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో ఆమె సమీపంలోని బంధువులతో మాట్లాడారు. అనంతరం ఇంటిలోకి వెళ్లి ఉరి వేసుకున్నారు.
సాయంత్రం సమయంలో బంధువులు వచ్చి చూడగా ఫ్యాన్‌కు విగతజీవిగా వేలాడుతూ కనిపించారు. ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ కలహాలతో ఆమె గత మూడు నెలలుగా మనస్తాపానికి గురవుతున్నట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే క్షణికావేశానికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని సమాచారం. సర్పంచ్ కుమార్తె సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, కుమారుడు ఓ పశు వైద్యకళాశాలలో తాత్కాలిక బోధకుడిగా పనిచేస్తున్నారు. ఆమెకు సోమవారం అంత్యక్రియలు చేసినట్లు సమాచారం.