వైద్యో నారాయణో హరి అంటారు.. ఆ దేవుడు మనకు ఊపిరి పోస్తే.. వైద్యులు ఏ ఆపద ఉన్నా మన ప్రాణాలు రక్షిస్తుంటారు. అందుకే వైద్యులను దేవుడితో పోలుస్తుంటారు. కానీ ఈ మద్య కొంత మంది వైద్యులు వైద్య వృత్తికే కలంకం తీసుకు వస్తున్నాడు. డబ్బు కోసం దేనికైనా సిద్దపడుతున్నారు. వైద్య వృత్తిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.
దేవుడు మనిషికి ఊపిరి పోస్తే.. ఏ ప్రమాదం వచ్చినా ప్రాణాలు రక్షించేది వైద్యుడు. అందుకే వైద్యో నారాయణో హరి అంటూ దేవుడితో పోల్చుతారు. వైద్యశాస్త్రంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. వైద్య శాస్త్రంలో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నారు. అలాంటిది ఈ మద్య కొంతమంది వైద్యులు నిర్వాకం వల్ల మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. చిన్న నిర్లక్ష్యం కొన్నిజీవితాలను నాశనం చేస్తున్నాయి. తాజాగా విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. చేతికి పురుగు కుట్టిందని ఓ మహిళా కూలి డాక్టర్ వద్దకు వెళ్లితే.. చేయినే తీయాల్సిన దుస్థితికి తీసుకు వచ్చారు వైద్యులు. పూర్తి వివరాల్లోకి వెళితే..
విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగు చూసింది. చేతికి పురుగు కుట్టిందీ.. డాక్టర్ వద్దకు వెళ్లిన ఓ మహిళ కూలికి డాక్టర్ కట్టు వేసి సర్జికల్ బ్లేడ్ మర్చిపోయాడు… అది కాస్త ఇన్ఫెక్షన్ కావడంతో పాపం ఆ మహిళ చేయిని పూర్తిగా తీయాల్సిన పరిస్థితి ఏర్పడటంతో బాధితురాలు లబో దిబో అంటుంది. అప్పుడప్పుడు డాక్టర్లు ఆపరేషన్ చేసి కడుపులో సీజర్, బ్లేడ్ లాంటివి మర్చిపోతారని విన్నాం.. కానీ ఇప్పుడు చేతికి కట్టు కట్టు అందులో బ్లేడ్ మర్చిపోయిన డాక్టర్ ఎంత నిర్లక్షం వహించాడో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. వైద్య విధానంతో ఎన్నో మార్పులు తీసుకు వచ్చిన డాక్టర్లు ఉన్న ఈ కాలంలో ఇలాంటి డాక్టర్ల వల్ల వైద్య వృత్తికే కలంకం అని అంటున్నారు.
కృష్ణా జిల్లా విసన్న పేట గ్రామానికి చెందిన నందిపాం సురేష్ భార్య తులసి. వయసు 22 సంవత్సరాలు. ఇళ్లు శుభ్రం చేస్తున్న సమయంలో చేతికి పురుగు కుట్టినట్టు అనిపించింది. అక్కడ కాస్త వాపు రావడంతో స్థానిక ఆసుపత్రికి వెళ్లింది. వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆసుపత్రికి వెళ్లింది. చేతికి ఇన్ఫెక్షన్ అయ్యిందని.. వెంటనే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఇమె చేతికి ఉన్న ఇన్ఫెక్షన్ ని తొలగించి కట్టుకట్టారు. డ్రెస్సింగ్ చేసే సమయంలో ఓ సర్జికల్ పరికరాన్ని చేతికి వేసి కట్టు కట్టారు. దాంతో ఇన్ఫెక్షన్ చేతికి మొత్తం పాకిపోయింది. దీంతో తులసి నొప్పి భరించలేక మళ్లీ ఆస్పత్రికి వెళ్లింది.. చేతిని పరీక్షించిన వైద్యులు అసలు విషయం తెలుసుకొని ఖంగు తిన్నారు.
కట్టు కట్టి అందులో సర్జికల్ బ్లేడ్ ఉంచడం వల్లనే ఇన్ఫెక్షన్ పూర్తిగా వ్యాపించి ఇంత దారుణం జరిగిందని తెలుసుకున్న డాక్టర్లు తమ తప్పును సరిదిద్దుకునే పనిలో పడ్డారు. కానీ అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. డాక్టర్ చేసిన నిర్లక్ష్యానికి ఇప్పుడు తులసి చేయి పూర్తిగా తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. చిన్న పురుగు కుట్టిందని డాక్టర్ల వద్దకు వెళితే.. చివరికి చేయినే తీయాల్సిన పరిస్థితి రావడంతో తులసి కన్నీరుమున్నీవుతుంది.తనకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారని.. రోజు కూలీ పనికి వెళ్తే కాని ఇల్లు గడవని పరిస్థితి అని.. ఇప్పుడు చేయి తీసేస్తే తన పరిస్థితి ఏంటని ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితురాలికి సరైన వైద్యం అందించాలిన స్థానికులు కోరుతున్నారు. అంతేకాదు నిర్లక్ష్యంగా వ్యవహరించిన డాక్టర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.