వైసీపీ కీలక నేతల్లో ఎంపీ విజయ సాయిరెడ్డి ఒకరు. ఈయన నిత్యం రాష్ట్ర, దేశ రాజకీయాల్లో బిజీగా ఉంటారు. ఇటీవల సీఎం జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో కూడా ఆయనతోనే విజయ సాయిరెడ్డి ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు అండమాన్ దీవుల్లో సడెన్ గా ప్రత్యక్షమైయ్యారు. నిత్యం ఉండే టెన్షన్ల నుంచి రిలీఫ్ కోసం చాలామంది ఈ దీవుల్లో స్కూబా డైవింగ్ చేస్తూ ఉంటారు. తాజాగా విజయసాయిరెడ్డి సైతం అదే చేశారు. దీనికి సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు వీడియో తెగ వైరల్ అవుతోంది.సముద్రంలో స్కూబా డైవింగ్ ని చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ.. దీనిని చేయాలంటే ఎంతో ధైర్యం కావాలి. ఎంపీ సాయిరెడ్డి ఆ సాహసం చేశారు.
స్కూబా డ్రైవింగ్ లో భాగంగా సముద్రంలో 12 మీటర్ల లోతు వరకు వెళ్లారు సాయిరెడ్డి. అక్కడ ఉన్న సముద్ర అందాలను ఆస్వాదించారు. “అండమాన్ సముద్రంలో 12 మీటర్ల లోతైన నీటిలో స్కూబా డైవింగ్ చేయడం థ్రిల్లింగ్గా ఉంది. లోతైన జీవితాన్ని చూడటం అద్భుతంగా ఉంది” అని ఎంపీ సాయిరెడ్డి తన ట్వీట్ లో పేర్కొన్నారు. అండమాన్ సముద్రంలో ఆయన చేసిన స్కూబా డైవింగ్ అందరిని ఆశ్చర్యపరిచింది. ఎప్పుడు ప్రతిపక్షంపై విరుచుకుపడే ఈయన రిలాక్స్ అవుతూ కనిపించడం విశేషం. మరి.. సాయిరెడ్టి చేసిన ఈ స్కూబా డైవింగ్ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.