ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారిక పార్టీ వైఎస్సాఆర్సీపీ ఆరు స్థానాలు గెలిచినప్పటికీ.. ఓడిపోయిన ఒక్క స్థానం గురించే దిగులు చెందింది. దీనికి క్రాస్ ఓటింగే కారణమని భావించిన వైసీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యేలపై వేటు వేసింది. వారిలో ఒకరు తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. అయితే ఆమె టీడీపీకి అమ్మడుుపోయారన్నా ఆరోపణలు నేపథ్యంలో ఆమె ప్రధాన అనుచరుడు తిరుగుబావుటా ఎగుర వేశారు. ఆమెపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఏపీలో రాజకీయాలు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల ముందు, తర్వాత అన్నట్లుగా మారాయి. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అధికారిక పార్టీ వైఎస్సాఆర్సీపీ ఆరు స్థానాలు గెలిచినప్పటికీ.. ఓడిపోయిన ఒక్క స్థానం గురించే దిగులు చెందింది. దీనికి క్రాస్ ఓటింగే కారణమని భావించిన వైసీపీ అధిష్టానం.. దానికి కొంత మంది ఎమ్మెల్యేలు కారణమని భావించి, ఫలితాలు వెలువడి 24 గంటలు కూడా గడవకముందే వేటు వేసింది. మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు వైసీపీ నేత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. వీరిలో ఆనం నారాయణ రెడ్డి, మేకపాటి చంద్ర శేఖర్ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో పాటు ఒక మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు. మిగిలిన ముగ్గురు పార్టీపై వ్యతిరేకత వ్యక్తం చేస్తుండటంతో వేటు వేసినా స్వాగతించారు. కానీ ఉండవల్లి శ్రీదేవి విషయంలో అలా కాదూ.. వైసీపీ కార్యకర్తలు.. ఆమె కార్యాలయంపై దాడి చేశారు. వ్యక్తిగత దూషణకు దిగుతున్నారు.
అయితే క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదన్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి..తనను కావాలనే పార్టీలో నుండి తొలగించారని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, సజ్జలపై ఆరోపణలు చేసిన ఆమె.. తనపై ఆరోపణలు చేసిన వారికి రిటర్న్ గిప్ట్ ఇచ్చి తీరుతానంటూ శపథం చేశారు. అయితే ఆమె మరో పార్టీలోకి చేరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె టీడీపీకి అమ్ముడుపోయిందంటూ తాడికొండలో పార్టీ కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈ సమయంలో ఉండవల్లి శ్రీదేవిపై ఆమె ప్రధాన అనుచరుడు, వైసీపీ కీలక నేత సందీప్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె ఎమ్మెల్యే అవ్వడం కోసం వైసీపీ కార్యకర్తలు అహర్నిశలు కష్టపడ్డామని, ఆస్తులు అమ్ముకున్నామని తెలిపారు. ఆమె ఎన్నికల ప్రచారం కోసం శ్రీదేవి భర్త డా. శ్రీధర్ డబ్బులు లేవని అడిగితే తానే ప్రచార రథం కొనిచ్చానని అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీ ఆఫీస్‌లో ఫర్నిచర్ నుండి ఆమె ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ వరుకు అన్నిమేమే కొనిచ్చామన్నారు.
ఆమె పుట్టిన రోజు వస్తే కేక్ కటింగ్‌కు రావాలని కోరితే.. రూ. 3 లక్షలు విలువ చేసే రింగ్స్ ఇస్తే కానీ రానన్నారని తెలిపారు. ఆమె కట్టుకునే చీరలు, చెప్పులు, చెవి కమ్మలు అన్నీ కార్యకర్తల కష్టమేన్నారు. ఎక్కడైనా ఎమ్మెల్యేలు కార్యకర్తలకు బహుమతులు ఇస్తారు కానీ మా తాడికొండలో మాత్రం మేమే ఎమ్మెల్యేకు గిప్టులు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. తాము నష్టపోయినా బాధపడలేదని, అయితే జగన్‌ను ఒక్క మాట అన్నా ఊరుకోమని అన్నారు. కుమార్తెను మీడియా ముందుకు తీసుకు వచ్చిన డ్రామాలు చేసిన ఆమె.. ఇప్పుడు తన కూతుర్ని కామెంట్ చేస్తున్నామని అంటున్నారని, ఆమె మొహం, ఆమె భర్త మొహం చూసి ఒక్కడు కూడా ఓటు వేయడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు ఉన్న మేనియా వల్ల ఆమెకు ఓట్లు పడ్డాయని, త్వరలో ఆఫీస్‌లో ,ఆమె ఇంట్లో తాము కొనిచ్చిన ప్రతి వస్తువు తిరిగి తెచ్చుకుంటామని హెచ్చరించారు. .