తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు కనుల వింధుగా జరిగే పండగ ఏదైన ఉందా అంటే.. అది ఖచ్చితంగా సంక్రాంతి అనే చెప్పాలి. మరీ ముఖ్యంగా ఈ పండగను ఏపీలోని ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. సన్నాయి చప్పుళ్లు, గింగిరెద్దుల విన్యాసాలు, కోడిపందాలు. ఇలా ఒకటేంటి.. ఎన్నో రకాల కార్యక్రమాలతో ప్రజలు సంతోషంగా సంక్రాంతి పండగను జరుపుకుంటారు. అయితే సంక్రాంతి పండగ వేళ గ్రామాల్లో పండగ వాతావరణం ఆవిష్కృతమవుతుంది.
ఇలా సంక్రాంతి పండగను జరుపుకోవడానికి హైదరాబాద్ నగరాన్ని వీడి చాలా మంది తమ తమ ఊళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక ప్రయాణికుల సౌకర్యార్థం TSRTC తాజాగా ఓ శుభవార్తను చెప్పింది. రానుపోను ఒకేసారి టిక్కెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణికులకు రిజర్న్ జర్నీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు TSRTC అధికారికంగా తెలిపింది. అయితే ఈ ఆఫర్ జనవరి 31 వరకూ ఉంటుందని TSRTC స్పష్టం చేసింది. దీంతో ఊళ్లకు వెళ్లే జనాలు ఈ రాయితీ ఆఫర్ విని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే TSRTC ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన ఏర్పాట్లు తీసుకుంటుంది. సంక్రాంతి పండగ వేళ నగరం నుంచి బస్సులు ఏపీలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు TSRTC ఇప్పటికే సిద్దం చేసి ఉంచింది. దీంతో పండగ నేపథ్యంలో ఈ నెల 14 నుండి 4,233 బస్సులను నడపనున్నట్లు TSRTC తెలిపింది. ఈ క్రమంలోనే ప్రయాణికులకు ఈ రాయితీ ఆఫర్ ను వారి ముందు ఉంచుతూ ఆదాయాన్ని పెంచే మార్గాలను వెతికింది. రానుపోను ఒకేసారి టిక్కెట్లు బుక్ చేసుకుంటే ప్రయాణికులకు రిజర్న్ జర్నీలో 10 శాతం రాయితీని కల్పించిన ఆ ఆఫర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.