గంట వ్యవధిలోనే ఒకే ఇంట్లో తల్లి, కుమారుడు మరణించారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?
తిరుపతిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొడుకు చనిపోయిన గంటకే తల్లి మరణించింది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలేం జరిగిందంటే? అది ఏపీలోని తిరుపతి రూరల్ చంద్రగిరి పరిధిలోని తుంగారంపల్లి గ్రామం. ఇక్కడే శేఖర్ (30)-రోజా దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి గతంలో వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఈ దంపతులకు ఓ కూతురు, కుమారుడు జన్మించాడు. ఇక భర్త తిరుపతి స్విమ్స్ లో ఔట్ సోర్సింగ్ కార్మికుడిగా పని చేస్తుండగా, భార్య మాత్రం గ్రామ వాలంటీర్ గా పని చేస్తుంది. దీంతో వారి సంసారం ఎంతో సాఫీగా సాగుతూ వచ్చింది.
అయితే శేఖర్ తల్లి చెంగమ్మ (52) కూడా కొడుకుతో పాటే ఉండేది. ఇదిలా ఉంటే.. మంగళవారం ఇంట్లో కరెంట్ సరఫరా కాకపోవడంతో శేఖర్ ఇంట్లో రిపేర్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే కరెంట్ షాక్ తో అతడు కిందపడిపోయాడు. దీనిని గమనించిన అతని భార్య రోజా గట్టిగా అరిచింది. స్థానికులు పరుగు పరుగున ఇంట్లోకి వచ్చి శేఖర్ ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. అతడు అప్పటికే కరెంట్ షాక్ తో మరణించాడని తెలిపారు. ఈ వార్త తెలుసుకున్న అతని తల్లి చెంగమ్మ తీవ్ర మనస్థాపానికి గురై గుండెలు పగిలేలా ఏడ్చింది.
కొడుకు లేడు, ఇక రాడనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేక చెంగమ్మ ఏడుస్తూనే ఒక్కసారిగా కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వెంటనే అస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. ఆమె గుండెపోటుతో మరణించిందని నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఒకే ఇంట్లో ఇద్దరు చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొడుకు చనిపోయిన గంటకే తల్లి మరణించిన ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.