ఓ కళ్యాణ మండపంలో పెళ్లి వేడుకు జరుగుతోంది. పెళ్లిని వీక్షించేందుకు ఇరు కుటుంబాల తరపు బంధువులు, అతిథులు వచ్చారు. బాజాభజత్రీల నడుమ ఆ వివాహం ఘనంగా జరుగుతోంది. మరోకవైపు పెళ్లికి వచ్చిన అతిథులు భోజనాలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈక్రమంలో ఒక్కసారిగా మండపంలోని టైల్స్ పగిపోవడం ప్రారంభించాయి. వాటి ముక్కలు ఎగిరి.. పక్కన ఉన్న వారిపై పడుతున్నాయి. ఈ హఠాత్పరిణామంతో అందరూ భయాందోళనకు గురై.. బయటకు పరుగులు తీశారు. ఈ ఘటన విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతంలోని చిన్నముషిడివాడలో ఉన్న దాట్ల కళ్యాణ మండపం ఓ పెళ్లి వేడుక జరుగుతుంది. ఆ కళ్యాణ మండపంలోని మొదటి అంతస్తులో జరుగుతున్న ఈ వివాహాన్ని చూసేందుకు ఇరుకుటుంబాల బంధువులు, ఇతర సభ్యులు వచ్చారు. ఇలా పిల్లలు, బంధువులతో ఆ కళ్యాణ మండపం సందడిగా మారింది. ఒకవైపు పెళ్లి వేడుక జరుగుతుండగా మరొవైపు భోజనలు జరుగుతున్నాయి. ఇలా పెళ్లికొచ్చిన వారు భోజనాలు చేస్తుండగా ఒక్కసారిగా టైల్స్ పగిలిపోవడం ప్రారంభించాయి. అదే ఫోర్లో మరికొన్ని చోట్ల టైల్స్ ఎగిరి పడ్డాయి. ఈ హఠాత్పరిణామంతో పెళ్లికి వచ్చిన వారు భయాందోళనకు గురయ్యారు. కళ్యాణ మండపంలో ఏదో ప్రమాదం జరగబోతుందనే భయంతో అక్కడి నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే నాలుగు అంతస్తులు ఉన్న ఈ భవనంలో మొదటి ఫ్లోర్ లో మాత్రమే పగులు ఏర్పడ్డాయి. మిగిలిన ప్రాంతంలో ఎలాంటి టైల్స్ పగిలిన ఆనవాళ్లు లేవు.
పెళ్లి బృందం ఆందోళన నేపథ్యంలో కళ్యాణ మండపం యాజమాన్యం కృష్ణరాయపురంలోని మరో కళ్యాణ మండపాన్ని పెళ్లి వారికి సమకూర్చారు. ఈఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కళ్యాణ మండపానికి చేరుకున్న పోలీసులు మొదటి అంతస్తును పరిశీలించారు. ఈ వివాహాన్ని తొలుత చినముషిడివాడలోని శారదాపీఠం పక్కనున్న పోర్టు కల్యాణ మండపంలో నిర్వహించెందుకు నెలన్నర క్రితమే బుక్ చేసుకున్నారు. అయితే అనివార్య కారణాలతో ఆ మండప నిర్వాహకులు ఇవ్వలేమని తెలుపడంతో దాట్ల కళ్యాణ మండపంలో ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇలా టైల్స్ పగిపోయిన ఘటన చోటుచేసుకుంది. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.