చావు ఎప్పుడు ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు అకస్మాత్తుగా మన ముందే కుప్పకూలిపోతుంటారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతుంటారు.. ప్రకృతి వైపరిత్యాలకు దూరమైతుంటారు.
మృత్యువు ఏ రూపంలో వెంటాడుతుందో ఎవరూ ఊహించలేరు.. అందుకే వాన రాకడ.. ప్రాణం పోకడ చెప్పడం కష్టం అంటారు. అప్పటి వరకు మనతో సంతోషంగా గడిపిన వాళ్లు హఠాత్తుగా చనిపోవడం చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ మద్య రోడ్డు ప్రమాదాలు, హార్ట్ ఎటాక్ తో చనిపోతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా వైఎస్సార్ జిల్లా వేంపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈత కోసం వెళ్లిన ముగ్గురు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. వివరాల్లోకి వెళితే..
వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండల పరిధిలోని ఓ చెరువు వద్ద తీవ్ర విషాదం నెలకొంది. అలవలపాడు లో ఆదివారం సెలవు కావడంతో ఈత కోసం వెళ్లిన ముగ్గురు అందులో మునిగి చనిపోయారు. వీరిలో ఇద్దరు చిన్న పిల్లలు కాగా మరోకరు యువకుడు. ఏప్రీల్ నెలలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి తాపానికి గ్రామాల్లో చాలా మంది బావులు, కాలువలు, చెరువుల్లో ఈత కోసం వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆదివారం సెలవు కావడంతో వేల్పులకు చెందిన జ్ఞానయ్య వయసు 25 సంవత్సరాలు, అలవలపాడు కి చెందిన సాయి సుశాంత్, వయసు 8 సంవత్సరాలు, సాయి తేజ, వయసు 11 సంవత్సరాలు వీళ్ల మేన మామ శశికుమార్ సుజల స్రవంతి కెనాల్ లోకి ఈతకోసం వెళ్లారు. అయితే ఆ కెనాల్ చాలా లోతుగా ఉండటంతో నలుగురిలో శశికుమార్ ఈదుకుంటూ బయట పడ్డారు.
కెనాల్ లోకి వెళ్లిన తర్వాత జ్ఞానయ్యతో పాలు సుశాంత్, సాయి తేజకు ఒక్కసారే ఊపిరి ఆడక మృతిచెందారు. శశికుమార్ పరుగున వెళ్లి విషయం గ్రామస్థులకు తెలియజేయడంతో ముగ్గురినీ వెలికితీసి వేంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సుశాంత్, సాయితేజ తల్లి చనిపోవడంతో అమ్మమ్మ ఇంటికి వచ్చి ఉంటున్నారు. వీరి బంధువు జ్ఞానయ్య ఈస్టర్ పండుగ సందర్భంగా వీళ్ల ఇంటికి వచ్చి అందరూ కలిసి మేనమామ శశికుమార్ తో కెనాల్ కి వెళ్లి ఊపిరి ఆడక చనిపోయారని వేంపల్లి ఎస్సై తిరుపాల్ నాయక్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.