ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. మొన్నటి వరకు ఎండలతో సతమతమయిన ప్రజలు ఇప్పుడు వర్షాల కారణంగా పడరాని ఇబ్బందులు పడుతున్నారు. అయితే నిన్నటి నుంచి వాతావరణంలో ఒక్కసారే మార్పులు సంబవించాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదిలా ఉంటే.. కాకినాడలో ఓ అరుదైన ఘటన అందరినీ ఆకర్షించింది. అక్కడ వాతావరణ మార్పు వల్ల ఉదయం ఎనిమిది గంటల తర్వాత కూడా పూర్తిగా అంధకారంగా ఉండటంతో ప్రజలు భయంతో వణికి పోయారు. ఏదైనా ఉపద్రవం సంబవిస్తుందా అని భయాందోళనకు గురయ్యారు.
ఆకాశంలో ఒక్కసారే పెను మార్పులు వచ్చాయి.. నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. చల్లటి గాలులతో అక్కడి వాతావరణంలో వింతైన మార్పు సంబవించింది. దీంతో కొన్ని షాపులు, హూటల్స్ లో బయట లైట్లు వేసుకొని మరీ పనిచేయాల్సి వచ్చింది. ఇక వాహనదారుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.. ఆ సమయంలో బయటకు రావాలంటే లైట్లు వేసుకొని మరీ రావాల్సి వచ్చిందని అన్నారు.
మొన్నటి వరకు విపరీతమైన ఎండలతో జనాలు పలు రకాల ఇబ్బందులు పడితే.. ఇప్పుడు ఇలా వింతైన వాతావరణం అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.