రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా ఏపీలో ఈ పండగ సందడి కాస్తా ఎక్కువగానే ఉంటాదని చెప్పాలి. ఏటా మాదిరిగానే ఈ ఏడాది పండగను కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేందుకు పట్టణాల్లో, దూర ప్రాంతాల్లో నివసించే వాళ్లు సొంత ఊర్లకి భారీగా తరలి వెళ్లారు. ఈ సంక్రాంతి పండగ ప్రజలకు సంతోషాన్ని ఇస్తే.. ఏపీ ప్రభుత్వానికి మాత్రం భారీగా ఖజానా నింపిందని చెప్పవచ్చు. పండగ సందర్భంగా ఏపీలో మద్యం అమ్మకాలు రికార్టు స్థాయిలో జరిగాయి. పండగ పుణ్యమా అని.. ఏపీ ఖజానాకు మాంచి ‘కిక్’ అందింది. గత మూడులో రోజుల్లో రూ.214 కోట్ల మేర మద్యం అమ్ముడుపోయినట్లు సమాచారం. ఈ సంఖ్యను బట్టే చెప్పవచ్చు.. సంక్రాంతి ఏపీ ప్రభుత్వానికి ఏ రేంజ్ లో కిక్ ఇచ్చిందని. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సంక్రాంతి పండగ సందర్భగా వేరే ప్రాంతాలో నివాసం ఉండేవారు సొంత ఊర్లకు చేరుకున్నారు. అలానే రాష్ట్రంలో జరిగే కోడి పందెలతో పాటు పండగను చూసేందుకు పొరుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనం ఏపీకి తరలివచ్చారు. ఇదే సమయంలో పందెలు, ఆటపాటలతో అందరు తెగ సందడి చేస్తున్నారు. అలానే మందుబాబులు సైతం ఈ మూడు రోజుల పండగను ఉత్సాహంగా గడిపేందుకు ఆసక్తి చూపించారు. దీంతో మద్యం దుకాణాల వద్ద భారీగా క్యూ కడుతున్నారు. మూడు రోజుల నుంచి ఏపీలోని దాదాపు అన్ని మద్యం షాపుల వద్ద విపరీతమైన రద్దీ కనిపించింది.
మూడురోజుల్లో రూ. 214 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయినట్లు ఎక్సైజ్ శాఖ గణాంకాలను బట్టి అర్థమవుతోంది. 83వేలకు పైగా బీర్ కేసులు, 2.33 లక్షలకు పైగా లిక్కర్ కేసులను మందుబాబులు తాగేశారు. అత్యధికంగా ఉభయగోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు జరిగాయి. అందులోనూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.27.81 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఆతర్వాతి స్థానంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మద్యం అమ్మకాలు జరిగాయి. కృష్ణా, గుంటూరు జిల్లాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కోడి పందాలు జరిగే ప్రాంతంలోకి మద్యం భారీగా తరలినట్లు సమాచారం.
ఏపీలోని మద్యం సరిపోక.. పొరుగురాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా మద్యం భారీగా డంప్ అవుతోందని టాక్ వినిపిస్తోంది. అంతకు ముందు నూతన సంవత్సర వేడుక సందర్భంగా కూడా ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు జరిగిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 31.. ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా రూ.127 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. ఆ సమయంలో మద్యం షాపులు రాత్రి 12 గంటల వరకు తెరచుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో.. సెలబ్రేషన్స్ పేరుతో మద్యాన్ని మంచినీళ్లలా తాగేశారు. తాజాగా సంక్రాంతి పండగ సందర్భంగా మరోసారి మద్యాన్ని మంచినీళ్ల తాగుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
సోమవారం కనుమ పండగ సందర్భంగా ఇంకా భారీగా అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పండుగ సందర్భంగా మద్యం దుకాణాల సమయం వేళలను ప్రభుత్వం గంటపాటు పొడిగించినట్లు తెలుస్తోంది. దీంతో ఏపీలో మద్యం సేల్స్ మరింతగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి… మద్యం ఏపీలో భారీగా మద్యం అమ్మకాలు జరగడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.