మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘మా’ అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు సీనియర్ నటుడు ప్రకాశ్‌రాజ్, హీరో మంచు విష్ణు, నటీమణులు జీవితా రాజశేఖర్, హేమ ప్రకటించారు. దీంతో మా ఎన్నికలు నాలుగుస్తంభాలాటగా మారింది. ఈ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలని తలపించేలా జరుగుతాయన్న భావన టాలీవుడ్ లో కలుగుతుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అధ్యక్ష పదవికి విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పై మిగతా అభ్యర్థులు లోకల్ నాన్ లోకల్ విమర్శలు చేస్తున్నారు. దీనిపై ప్రకాశ్ రాజ్ తనదైన స్టైల్‌లో స్పందించారు. లోకల్ నాన్ లోకల్ ఏంటి? కళాకారులంతా యునివర్సల్ అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
రెండు గ్రామాలు దత్తత తీసుకుంటే నాన్ లోకల్ అనలేదని అవార్డులు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ అనలేదని మండిపడ్డారు. ఏడాదిగా ఈ విషయంలో గ్రౌండ్ వర్క్ చేశామని తెలిపారు. మొదటి సారి మీడియాను చూసి భయం వేస్తోందని మాది చిన్న అసోసియేషన్ ఊహాపుహాలు చూసి భయం వేసిందని ప్రకాశ్ రాజ్ పేర్కొన్నారు. సున్నితమైన కళాకారులు ఉన్న అసోసియేషన్ అందరికి ఎంటర్టైన్ గా మారిపోయిందన్నారు. ఇక్కడ ఎదో జరుగుతోంది చూస్తూ ఊరుకోలేమని హెచ్చరించారు.
ఈ విషయంలో చిరంజీవి గారిని ఎందుకు లాగుతున్నారని ఫైర్ అయ్యారు ప్రశాశ్ రాజ్. రాజకీయంగా నాకు నాగబాబు విరోధం ఉన్నా ఇక్కడ ఒక్కటేనని, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు మీడియా ముందుకు రావద్దని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకాశ్ రాజు తెలిపారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు ఉత్కంఠభరితంగా మారాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది.