ఏపీలో పొలిటికల్ వార్ ఏ రేంజ్ లో ఉందో అందరికి తెలిసిందే. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో ఉంది. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత ఈ మాటల యుద్ధం బాగా పెరిగింది. ఇక తాజాగా ఈ ఏపీ రాజకీయాల సెగ.. ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డే సందర్బంగా కూడా కనిపించింది.
వైజాగ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియ మధ్య రెండో వన్డే జరిగింది. తక్కువ పరుగులే నమోదైన ఈ మ్యాచ్ లో భారత్ ఘోర పరాభవాన్ని మూటకట్టుకుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియ 10 వికెట్ల తేడాతో భారత్ పై గెలిచింది. వైజాగ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్.. ప్రేక్షకలను ఎంతో ఆకట్టుకుంది. అయితే మ్యాచ్ సందర్భంగా కనిపించిన పలు దృశ్యాలు అందరిని ఆశ్చర్యానికి గురి చేశాయి. అప్పడప్పుడు స్టేడియంలో అరుదైన దృశ్యాలు కెమెరా కళ్లకు చిక్కుతాయి. అలానే తాజాగా వైజాగ్ వేదికగా జరిగిన భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా కొన్ని దృశ్యాలు కనిపించాయి. క్రీడా వాతావరణం ఉన్న ఆ స్టేడియంలో రాజకీయ వాతావరణం కనిపించింది. కొందరు యువకులు ‘సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ’ అంటూ ప్లకార్డలు పటుకుని కనిపించార. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా రాజకీయాల్లో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటారు. అలానే ఒక పార్టీకి చెందిన కార్యకర్తలు మరో పార్టీపై విమర్శలు, ఆరోపణలు చేస్తుంటారు. అలానే తమకు అవకాశం దొరికిన సందర్భంలో ప్రత్యర్థి పార్టీపై తమ నిరసనలు తెలుపుతుంటారు. అయితే ఇలాంటివి అన్ని రోడ్లపై, ఇతర బహిరంగ ప్రదేశాల్లో జరుగుతుంటాయి. చాలా అరుదుగా మాత్రమే క్రీడా ప్రాంగణాల్లో, క్రికెట్ స్టేడియాల్లో రాజకీయానికి సంబంధించిన దృశ్యాలు కనిపిస్తుంటాయి. తాజాగా విశాఖపట్నం వేదికగా భారత్, ఆస్ట్రేలియ మధ్య జరిగిన రెండో వన్డే మ్యాచ్ లో పొలిటికల్ దృశ్యాలు కనిపించాయి. అందరి దృష్టి మ్యాచ్ పై ఉంటే కొందరు మాత్రం ఏపీ రాజకీయాలను చూపించారు. మాములుగానే ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా ఉంటాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య ఓ రేంజ్ లో మాటల యుద్ధం కొనసాగుతుంది.
ఇక ఇటీవల ముగిసిన ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తరువాత ప్రతిపక్షాలు దూకుడు పెంచాయి. అధికార పార్టీపై విమర్శలను తీవ్రతరం చేశాయి. అలానే ఇరుపార్టీల కార్యకర్తల మధ్య కూడా వాడీవేడీ వాతావరణం కనిపిస్తుంది. ఎవరికి అవకాశం దొరికితే వాళ్లు.. తమ నిరసనను తెలిపేందుకు సిద్ధ పడుతున్నారు. విశాఖ వేదికగా జరిగిన క్రికెట్ మ్యాచ్ లో కొంతమంది యువకుల చేతుల్లో’ సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ’ అని రాసున్న ప్లకార్డులు కనిపించాయి. ఎన్నికలకి ఇంకా ఏడాది సమయం ఉన్నా అప్పుడే ఆ వాతావరణం కనిపిస్తుంది. విశాఖ క్రికెట్ స్టేడియంలో ఏపీ రాజకీయలకు సంబంధించి ప్రదర్శించిన ప్లకార్డులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటింట్లో వైరల్ అవుతోన్నా ఈ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.